శని, కుజుడు, కేతువులు సంయోగం.. 3 రాశుల వారికి నెల రోజులు పాటు చిన్నపాటి సమస్యలు.. తస్మాత్ జాగ్రత్త!

కుజుడు, శని, కేతువుల సంయోగం, షడష్టక యోగం, కుజ-కేతు యోగంను సృష్టిస్తోంది. ఈ యోగం జూన్ 30 నుంచి ప్రభావవంతమవుతుంది. జూలై 28 వరకు ఇది కొనసాగుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ మూడు గ్రహాల కలయికతో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తప్పవు.

Published on: Jun 23, 2025 12:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో కొన్ని శుభయోగాలు, కొన్ని అశుభ యోగాలు ఏర్పడతాయి. అయితే ఇప్పుడు కుజుడు, కేతువు ప్రమాదకరమైన యోగాన్ని సృష్టిస్తున్నారు. సింహ రాశిలో కుజుడు-కేతువు కారణంగా కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే శని-కుజుడు కూడా అశుభ యోగాలను ఏర్పరుస్తున్నారు.

శని, కుజుడు, కేతువులు సంయోగం (pinterest)
శని, కుజుడు, కేతువులు సంయోగం (pinterest)

కుజుడు, శని, కేతువుల సంయోగం, షడష్టక యోగం, కుజ-కేతు యోగంను సృష్టిస్తోంది. ఈ యోగం జూన్ 30 నుంచి ప్రభావవంతమవుతుంది. జూలై 28 వరకు ఇది కొనసాగుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ మూడు గ్రహాల కలయికతో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తప్పవు.

కుజుడు, కేతువు, శని కలయికతో ఈ మూడు రాశులకు చిన్నపాటి సమస్యలు

1.మేష రాశి

మేష రాశి వారికి కుజుడు-కేతువు-శని సంయోగం కాస్త సమస్యలను తీసుకొస్తుంది. కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది.

2.సింహ రాశి

సింహ రాశి వారికి ఈ మూడు గ్రహాల కలయిక వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టెన్షన్ కూడా పెరిగిపోతుంది. కెరియర్‌లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో సింహ రాశి వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.

3.కన్యా రాశి

కన్యా రాశివారికి కుజుడు-కేతువు సంయోగం వలన ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కొంతమంది తెలియని శత్రువులు మీకు ఇబ్బందుల్ని కలిగించవచ్చు. మీరు ఏదైనా విషయంలో ఒత్తిడికి గురవచ్చు. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కోర్టు కేసుల్లో మీరు అనుకున్నట్లు జరగకపోవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

News/Rasi Phalalu/శని, కుజుడు, కేతువులు సంయోగం.. 3 రాశుల వారికి నెల రోజులు పాటు చిన్నపాటి సమస్యలు.. తస్మాత్ జాగ్రత్త!
News/Rasi Phalalu/శని, కుజుడు, కేతువులు సంయోగం.. 3 రాశుల వారికి నెల రోజులు పాటు చిన్నపాటి సమస్యలు.. తస్మాత్ జాగ్రత్త!