జూలై 13 నుంచి 138 రోజులు పాటు తిరోగమనంలో శని.. ద్వాదశ రాశులపై ప్రభావం.. ఏ రాశులకు లాభమో తెలుసుకోండి!

మీనరాశిలో శని తిరోగమనం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని అందిస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో శనిని కర్మకు న్యాయ నిర్ణీతగా భావిస్తారు. శనిగ్రహం మనం చేసే మంచి చెడు పనులను బట్టి ఫలితాన్ని ఇస్తుంది. ప్రస్తుతం శని మీన రాశిలో ఉన్నాడు. జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు 138 రోజులు పాటు శని తిరోగమనంలో ఉంటాడు.

Published on: Jul 03, 2025 12:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యాయ దేవుడు శని మనం చేసే మంచి వాటికి మంచి ఫలితాలని, చెడు పనులకు చెడు ఫలితాలని అందిస్తాడు. జూలై 13 ఉదయం 7:24 గంటలకు శనితిరోగమనం చెందుతాడు. మీనరాశిలో శని తిరోగమనం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని అందిస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో శనిని కర్మకు న్యాయ నిర్ణీతగా భావిస్తారు. శని గ్రహం మనం చేసే మంచి చెడు పనులను బట్టి ఫలితాన్ని ఇస్తుంది.

138 రోజులు పాటు శని తిరోగమనం.. ద్వాదశ రాశులపై ప్రభావం
138 రోజులు పాటు శని తిరోగమనం.. ద్వాదశ రాశులపై ప్రభావం

ఈ గ్రహం కారణంగా జీవితంలో క్రమశిక్షణ, స్థిరత్వం వస్తాయి. ప్రస్తుతం శని మీన రాశిలో ఉన్నాడు. జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు 138 రోజులు పాటు శని తిరోగమనంలో ఉంటాడు. ఇది 12 రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కొందరి వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడుతుంది. మరి శని తిరోగమనము వలన ఏ రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయి, 12 రాశుల వారు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

138 రోజులు పాటు శని తిరోగమనం.. ద్వాదశ రాశులపై ప్రభావం

మేష రాశి:

మేష రాశి వారికి శని తిరోగమనం వలన కొత్త అవకాశాలు వస్తాయి. అవసరమైన ఖర్చులను తగ్గించుకుంటారు. మానసిక సమస్యలు తొలగిపోతాయి. పాత అనుభవాల నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటారు. నెగిటివిటీ తొలగిపోతుంది.

వృషభ రాశి:

వృషభ రాశి వారికి శని తిరోగమనం వలన సులభంగా లాభాలని పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారు పని ప్రదేశంలో ఇతరుల సపోర్ట్ లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కనుక జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అడ్డంకులు, ఆలస్యం వంటివి చూడొచ్చు. కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. తోటి ఉద్యోగస్తులు, బాస్ తో గొడవలు పడకుండా చూసుకోవాలి. కష్టపడి పనిచేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కర్కాటక రాశి:

కర్కాటకరాశి వారు శని తిరోగమనం వలన తీర్థయాత్రలకు వెళ్తారు. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్ ని అందుకుంటారు. అదృష్టం పై ఆధారపడకుండా పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

సింహ రాశి:

సింహ రాశి వారికి శని తిరోగమనం చిన్న చిన్న సమస్యలను తీసుకువస్తుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. పని ప్రదేశంలో పరిస్థితులు మారుతాయి. అప్పుడప్పుడు రిస్క్ తీసుకోకుండా చూసుకోండి. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్యా రాశి:

కన్యారాశి వారికి శని తిరోగమనం వలన చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో తీసుకునే ఆహారంపై దృష్టి పెట్టాలి. వైవాహిక జీవితంలో కూడా చిన్నపాటి సమస్యలు వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

తులా రాశి:

తులా రాశి వారికి శని తిరోగమనం వలన కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా చర్మ సమస్యలు, బీపీకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి శని తిరోగమనం వలన చదువు, పిల్లలు, ప్రేమ జీవితం పై ప్రభావం పడుతుంది. ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఏకాగ్రతని కోల్పోయే అవకాశం ఉంది. సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతో ప్రేమ జీవితంలో సమస్యలు రావచ్చు.

ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి శని తిరోగమనం ఇబ్బందులను కలిగించవచ్చు. టెన్షన్ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తల్లి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

మకర రాశి:

మకర రాశి వారికి శని తిరోగమనం వలన మానసిక ఇబ్బందులు ఎదురవచ్చు. సోదరులతో ఆర్గ్యుమెంట్లు చేయకండి. ప్రయాణాలు కలిసి వస్తాయి, కానీ నీరసం ఎక్కువ అవుతుంది. టైం కి పూర్తి చేయడం కాస్త చాలెంజింగ్ గా ఉంటుంది.

కుంభ రాశి:

కుంభ రాశి వారికి శని తిరోగమనం వలన గొంతు, పంటి సమస్యలు రావచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో సంతోషం కూడా తక్కువ అవవచ్చు.

మీన రాశి:

మీన రాశి వారికి శని తిరోగమనం వలన మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. బద్ధకంగా ఉండకండి. ఈ సమయంలో మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆరోగ్యం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పై ఎక్కువ ప్రభావం పడుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

News/Rasi Phalalu/జూలై 13 నుంచి 138 రోజులు పాటు తిరోగమనంలో శని.. ద్వాదశ రాశులపై ప్రభావం.. ఏ రాశులకు లాభమో తెలుసుకోండి!
News/Rasi Phalalu/జూలై 13 నుంచి 138 రోజులు పాటు తిరోగమనంలో శని.. ద్వాదశ రాశులపై ప్రభావం.. ఏ రాశులకు లాభమో తెలుసుకోండి!