జూన్ 24 నుంచి వృషభ రాశితో పాటు ఈ రెండు రాశులకు ఊహించని లాభాలు.. గజకేసరి రాజయోగంతో సమస్యలకు స్వస్తి!

చంద్రుడు జూన్ 24న రాత్రి 11:45 గంటలకు మిధున రాశిలో సంచరిస్తాడు. గురువు ఇప్పటికే అదే రాశిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మిధున రాశిలో గురు, చంద్రుల కలయిక ఏర్పడుతుంది. దీంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా మారుతుంది.

Published on: Jun 20, 2025 3:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అన్ని గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల రాశి మార్పు 12 రాశులను ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు గ్రహాల సంచారం కారణంగా శుభయోగాలు ఏర్పడతాయి. శుభయోగాలలో గజకేసరి యోగం కూడా ఒకటి. ఇది గురు, చంద్రుల కలయికతో ఏర్పడుతుంది. చంద్రుడు మనసుకి కారకుడు కాబట్టి, వృత్తిలో విజయం, ఒత్తిడినుంచి ఉపశమనం లాంటివి కొన్ని రాశులవారు పొందవచ్చు. జ్యోతిష్యశాస్త్రం చెబుతున్న దాని ప్రకారం, ఈ యోగం మరోసారి ఏర్పడనుంది.

జూన్ 24 నుంచి వృషభ రాశితో పాటు ఈ రెండు రాశులకు ఊహించని లాభాలు (pinterest)
జూన్ 24 నుంచి వృషభ రాశితో పాటు ఈ రెండు రాశులకు ఊహించని లాభాలు (pinterest)

చంద్రుడుజూన్ 24న రాత్రి 11:45 గంటలకు మిధున రాశిలో సంచరిస్తాడు. గురువు ఇప్పటికే అదే రాశిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మిధున రాశిలో గురు, చంద్రుల కలయిక ఏర్పడుతుంది. దీంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా మారుతుంది.

గజకేసరి రాజయోగంతో ఈ రాశులకు బోలెడు లాభాలు

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి గజకేసరి రాజయోగం అనేక మార్పులను తీసుకువస్తుంది. పూర్వికుల ఆస్తిని పొందవచ్చు. కుటుంబంలో ఏమైనా గొడవలు ఉంటే పరిష్కరించుకోవచ్చు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వివాహం కానివారికి వివాహ అవకాశాలు వస్తాయి.

గజకేసరిరాజయోగం వలన మానసిక సంతృప్తి కలుగుతుంది. దానధర్మాలు చేస్తారు. కెరీర్‌కు సంబంధించిన కొత్త పాలసీలు పూర్తి చేస్తారు. భాగస్వామితో బంధం మధురంగా మారుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

2.మిధున రాశి

మిధున రాశి వారికి గజకేసరి రాజయోగం అదృష్టాన్నితీసుకురాగలదు. ఈ సమయంలో మీ టాలెంట్ ఇంకా మెరుగుపడుతుంది. ఎప్పటి నుంచో పూర్తికాని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. పాత వ్యాధినుంచి బయటపడతారు. ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో మీరు ప్రయాణాలు కూడా చేస్తారు. కెరీర్‌లో ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్నవారు పదవులు పొందవచ్చు.

3.తులా రాశి

తులా రాశి వారికి గజకేసరి రాజయోగంతో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. ఎప్పటినుంచి పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు ఇప్పుడు సర్దుకుంటాయి. ఈ సమయంలో తులా రాశి వారు కంపెనీ నుంచి ఆఫర్లను పొందుతారు. మీ తల్లికి సంబంధించిన విషయాల వల్ల ఆందోళన ఉంటే, ఇప్పుడు ఉపశమనం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా ఈ సమయంలో పెరుగుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More