నవంబరు 19 నుంచి ఈ రాశులకు శుభ సమయం.. సూర్య అనుగ్రహంతో డబ్బు, పదోన్నతులతో పాటు అనేక లాభాలు!
గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు కూడా ఎప్పటికప్పుడు తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. నవంబరు 19న సూర్యుడు అనురాధ నక్షత్రంలో సంచరిస్తాడు. డిసెంబర్ 2 వరకు ఈ నక్షత్రంలో ఉంటాడు.
Sun Transit 2025: గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు కూడా ఎప్పటికప్పుడు తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. ఇలా మార్పు జరగనప్పుడు, అది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. త్వరలోనే సూర్య సంచారంలో మార్పు ఉండబోతోంది. ఈ మార్పు కారణంగా ఏ రాశులకు లాభాలు కలుగుతాయి, ఏ రాశిలో వారు ఎలాంటి మార్పులను చూడొచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్యుని నక్షత్ర సంచారం
గ్రహాల రాజు సూర్యుని నక్షత్రంలో మార్పు చోటు చేసుకోనుంది. నవంబరు 19న సూర్యుడు అనురాధ నక్షత్రంలో సంచరిస్తాడు. డిసెంబర్ 2 వరకు ఈ నక్షత్రంలో ఉంటాడు. అనురాధ నక్షత్రానికి అధిపతి శని. సూర్యుడు ఆత్మ, ధైర్యం మొదలైన వాటికి కారకంగా పరిగణిస్తారు. సూర్యుని నక్షత్ర సంచారంలో మార్పు కొన్ని రాశిచక్రాల జీవితంలో మంచి మార్పులను తెస్తుంది. ఈ సమయంలో ఈ రాసుల వారు అదృష్టంతో పాటు ఆర్థిక, వృత్తిపరమైన పురోగతిని పొందుతారు. మరి ఇక సూర్య నక్షత్ర సంచారంలో మార్పు వల్ల ఏ రాశులకు ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోండి.
అనురాధ నక్షత్రంలో సూర్యుడు.. ఈ రాశులకు లాభాలు
1. మిథున రాశి
సూర్య నక్షత్ర సంచారం మిథున రాశి వారికి మంచిది. ఈ సమయంలో, మీ పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. ఎప్పటి నుంచో పూర్తి కానీ పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో పురోగతిని చూస్తారు. డబ్బు సంపాదించడానికి అవకాశాలుంటాయి, ఇది ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. అదృష్టం మీతో ఉంటుంది.
2. సింహ రాశి
సూర్య సంచారం సింహ రాశి ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో, పనిచేసే వ్యక్తులు పదోన్నతులతో ఆదాయాన్ని పెంచుకోవచ్చు. సంబంధాలలో తీవ్రత, సాన్నిహిత్యం ఉంటుంది. సంపదకు సంబంధించిన విషయాలను పరిష్కరించుకోవచ్చు. మీరు పలుకుబడి కలిగిన వ్యక్తులను కలవవచ్చు. కోర్టులో విజయ సంకేతాలు కనిపిస్తున్నాయి.
3. వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి సూర్య సంచార సమయం ముఖ్యమైనది. ఈ సమయంలో మీకు కావలసినది మీకు లభిస్తుంది. మీరు భూమి, భవనాలు, వాహనాలు కొనుగోలు చేయవచ్చు. ఎవరైనా మీ కల సాకారం కావచ్చు.
మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదృష్టవశాత్తూ, పనులు పూర్తవుతాయి. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధైర్యం పెరుగుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


