గ్రహాలు కాలనుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. దీంతో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. కుజుడు కూడా కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాడు. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తాయి. అక్టోబర్ 27 అంటే ఈరోజు కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. 40 రోజులు పాటు అదే రాశిలో ఉంటాడు.
రుచక రాజయోగం

ఆ తర్వాత డిసెంబర్ 7న రాశి మార్పు చెందుతాడు. కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు రుచక రాజయోగం ఏర్పడుతుంది. ఈ రుచక రాజయోగం కొన్ని రాశుల వారికి ఎక్కువ లాభాలను తీసుకురాబోతోంది.
ఈరోజు నుంచి 40 రోజులు పాటు ఈ రాశుల వారికి అనేక విధాలుగా కలిసివస్తుంది. సంతోషంగా ఉంటారు, ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలను పొందుతారు.
కుజుడి రాశి మార్పుతో రుచక రాజయోగం.. ఈ రాశులకు లాభాలు
1.మిథున రాశి
మిథున రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పని ప్రదేశంలో మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారులకు కూడా ఇదే మంచి సమయం. ప్రేమ జీవితంలో నమ్మకం పెరుగుతుంది, వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు.
2.కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రుచకరాజు యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులను చూస్తారు, శుభవార్తలు వింటారు, సంతోషంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది.
3.మకర రాశి
ఈరోజు నుంచి 40 రోజులు పాటు మకర రాశి వారికి రుచక రాజయోగం మంచి ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలను పొందుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
4.కర్కాటక రాశి
{{/usCountry}}ఈరోజు నుంచి 40 రోజులు పాటు మకర రాశి వారికి రుచక రాజయోగం మంచి ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలను పొందుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
4.కర్కాటక రాశి
{{/usCountry}}కర్కాటక రాశి వారికి ఈ రుచక రాజయోగం అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులను చూస్తారు. ప్రభుత్వ ఉద్యోగం లభించవచ్చు. ఈ రాశి విద్యార్థులు కూడా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. సంతోషంగా ఉంటారు.