నేటి నుంచి 40 రోజుల పాటు ఈ రాశులకు పండుగే.. రుచక రాజయోగంతో డబ్బు, శుభవార్తలు, అందమైన ప్రేమ జీవితంతో పాటు ఎన్నో

కుజుడు కూడా కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాడు. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తాయి. అక్టోబర్ 27 అంటే ఈరోజు కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. 40 రోజులు పాటు అదే రాశిలో ఉంటాడు. కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు రుచక రాజయోగం ఏర్పడుతుంది. 

Published on: Oct 27, 2025, 10:00:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు కాలనుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. దీంతో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. కుజుడు కూడా కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాడు. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తాయి. అక్టోబర్ 27 అంటే ఈరోజు కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. 40 రోజులు పాటు అదే రాశిలో ఉంటాడు.

కుజుడి రాశి మార్పుతో రుచకరాజు యోగం.. ఈ రాశులకు లాభాలు (pinterest)
కుజుడి రాశి మార్పుతో రుచకరాజు యోగం.. ఈ రాశులకు లాభాలు (pinterest)

రుచక రాజయోగం

ఆ తర్వాత డిసెంబర్ 7న రాశి మార్పు చెందుతాడు. కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు రుచక రాజయోగం ఏర్పడుతుంది. ఈ రుచక రాజయోగం కొన్ని రాశుల వారికి ఎక్కువ లాభాలను తీసుకురాబోతోంది.

ఈరోజు నుంచి 40 రోజులు పాటు ఈ రాశుల వారికి అనేక విధాలుగా కలిసివస్తుంది. సంతోషంగా ఉంటారు, ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలను పొందుతారు.

కుజుడి రాశి మార్పుతో రుచక రాజయోగం.. ఈ రాశులకు లాభాలు

1.మిథున రాశి

మిథున రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పని ప్రదేశంలో మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారులకు కూడా ఇదే మంచి సమయం. ప్రేమ జీవితంలో నమ్మకం పెరుగుతుంది, వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు.

2.కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రుచకరాజు యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులను చూస్తారు, శుభవార్తలు వింటారు, సంతోషంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది.

3.మకర రాశి

ఈరోజు నుంచి 40 రోజులు పాటు మకర రాశి వారికి రుచక రాజయోగం మంచి ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలను పొందుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

4.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రుచక రాజయోగం అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులను చూస్తారు. ప్రభుత్వ ఉద్యోగం లభించవచ్చు. ఈ రాశి విద్యార్థులు కూడా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. సంతోషంగా ఉంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More