...
...
Next Story

ఈరోజు నుంచి ఆషాఢ మాసం మొదలు.. ఈ నెలలో ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలి, కోడలు పుట్టింటికి ఎందుకు?

ఆషాఢ మాసంలో శుభకార్యాలు జరపరు. వివాహాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో జరపరు. ఆషాడ మాసంలో అత్తా కోడలు ఒకే ఇంట్లో ఉండకూడదని నమ్మకం కూడా ఉంది. ఉత్తరాయణ, దక్షిణాయన కథల ప్రకారం చూసినట్లయితే, శ్రీ మహావిష్ణువు ఆషాడ మాసంలోనే నిద్రలోకి వెళ్తారు.

Published on: Jun 26, 2025, 07:00:17 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

తెలుగు నెలల్లో నాలుగవది ఆషాడమాసం. ఈ నెలతోనే వర్షఋతువు ప్రారంభమవుతుంది. ఆషాడ మాసంలో శుభకార్యాలు జరపరు. వివాహాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో జరపరు. ఆషాడ మాసంలో అత్తా–కోడలు ఒకే ఇంట్లో ఉండకూడదని నమ్మకం కూడా ఉంది.

ఈసారి ఆషాఢ మాసం ఎప్పుడు వచ్చింది?

ఆషాడ మాసం (pinterest)
ఆషాడ మాసం (pinterest)

ఈ సారి ఆషాడ మాసం జూన్ 26, గురువారం ఆషాడ శుక్ల పాడ్యమి నుంచి మొదలవుతుంది. జూలై 24తో ముగుస్తుంది. ఇక ఈ నెలరోజులు పాటు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం.

ఆషాడం అంటే ఏంటి?

ఆషాడం అనేది "ఆది" అనే సంస్కృత నుంచి వచ్చింది. "ఆది" అంటే శక్తి అని అర్థం. ఆషాడ మాసంలో దేవతల్ని పూజిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. ఈ మాసంలో చేసే వ్రతాలకు, పూజలకు ఎంతో శుభఫలితాన్ని పొందవచ్చు.

ఆషాడంలోనే మహా విష్ణువు నిద్రలోకి వెళ్తారు

ఉత్తరాయణ, దక్షిణాయన కథల ప్రకారం చూసినట్లయితే, శ్రీ మహావిష్ణువు ఆషాడ మాసంలోనే నిద్రలోకి వెళ్తారు. అందుకనే వివాహంచేసుకున్న దంపతులకు విష్ణు ఆశీస్సులు లభించవని నమ్మకంతో ఆషాడ మాసంలో పెళ్లిళ్లు చేయరు.

కోడలు పుట్టింటికి ఎందుకు?

కొత్తగా వచ్చిన కోడలు కూడా ఆషాడ మాసం వస్తే అత్తవారింట్లో ఉండకూడదు. ఆమెను పుట్టింటికి పంపిస్తారు. ఆషాడ మాసంలో గర్భం దాల్చితే వేసవిలో ప్రసవం అవుతుంది. అలాంటి సమయంలో బిడ్డకు అనారోగ్య సమస్యలు వస్తాయని పూర్వీకులు నమ్మారు. అందుకే భార్యాభర్తల్ని ఈ నెలలో దూరంగా ఉంచడం మొదలుపెట్టారు. ఇప్పటికీ కూడా ఈ సంప్రదాయాన్ని చాలామంది పాటిస్తున్నారు.

ఆషాడ మాసంలో ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలి?

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks