ఈరోజు నుంచి దక్షిణాయనం మొదలు, ఇలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది!
సూర్యుడి గమనాన్ని ఆధారంగా తీసుకుని కాలాన్ని రెండు భాగాలుగా విభజించడం జరిగింది. భూమధ్యరేఖకు ఉత్తరం వైపు సూర్యుడు కనబడితే అది ఉత్తరాయణం, అదే భూమధ్యరేఖకు దక్షిణంగా సంచరిస్తే అది దక్షిణాయనం. కర్కాటక సంక్రాంతి నాడు ఏం చేస్తే మంచిది వంటివి తెలుసుకుందాం.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశిని మారుస్తూ ఉంటాయి. సూర్యుడు కూడా ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడి గమనాన్ని ఆధారంగా తీసుకుని కాలాన్ని రెండు భాగాలుగా విభజించడం జరిగింది. భూమధ్యరేఖకు ఉత్తరం వైపు సూర్యుడుకనబడితే అది ఉత్తరాయణం, అదే భూమధ్యరేఖకు దక్షిణంగా సంచరిస్తే అది దక్షిణాయనం. అంటే సంవత్సరంలో ఆరు నెలలు ఉత్తరాయణం, మరో ఆరు నెలలు దక్షిణాయనం.

కర్కాటక సంక్రాంతి నుంచి దక్షిణాయనం
- మకరసంక్రాంతి నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది. కర్కాటక సంక్రాంతి నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. ఈసారి కర్కాటక సంక్రాంతి జూలై 16న, అంటే ఈరోజు నుంచి మొదలవుతుంది.
- మకర రాశి, కుంభ రాశి, మీన రాశి, మేష రాశి, వృషభ రాశి, మిథున రాశుల్లో సూర్యుడు సంచరించినప్పుడు ఈ ఆరు నెలలు కూడా ఉత్తరాయణం అవుతుంది.
- కర్కాటకరాశి, సింహ రాశి, కన్యా రాశి, తులా రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశిలో సూర్యుడు సంచరించినప్పుడు ఈ ఆరు నెలల కాలం కూడా దక్షిణాయనం అవుతుంది.
- ఏడాదికి రెండు రోజులు మాత్రమే సూర్యుడు సరిగ్గా తూర్పు వైపు ఉదయిస్తాడు. ఆ రెండు రోజులు మార్చి 21, సెప్టెంబర్ 23.
దేవతలకు ఉత్తరాయణం, దక్షిణాయనం:
దేవతలకు ఉత్తరాయణం అంతా పగలు, దక్షిణాయనం అంతా రాత్రి. దక్షిణాయనంలో మహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఈ సమయంలో ఉపవాసాలు చేయడం, పూజలు చేయడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. మఠాధిపతులు, పీఠాధిపతులు, యోగులు చాతుర్మాసంలో దీక్ష చేస్తారు. చాతుర్మాసం ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశి నుంచి కార్తీక పూర్ణిమ ముందు వచ్చే ఏకాదశి వరకు ఉంటుంది.
పితృదేవతలకు దక్షిణాయనం:
దక్షిణాయనం సమయంలో పితృదేవతలను ఆరాధిస్తే మంచి జరుగుతుంది. సంతానంఅందించే తర్పణాలు స్వీకరించడానికి భూమిపైకి పితృదేవతలు వస్తారని అంటారు. మహాలయ పక్షాలను పాటించే వారికి సంతానం వృద్ధి జరుగుతుంది. సుఖ సంతోషాలు కలుగుతాయి. పెద్దల రుణం తీర్చుకోవడానికి ఇది చాలా ఉత్తమ మార్గం.
కర్కాటక సంక్రాంతి నాడు ఏం చేస్తే మంచిది?
మనం మకర సంక్రాంతి నాడు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి దానధర్మాలు చేస్తాము. కర్కాటక సంక్రాంతి నాడు కూడా దానధర్మాలు చేస్తే మంచిది. ఈ రోజు మహావిష్ణువు కవచం, విష్ణుసహస్రనామం పఠిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు. గాయత్రి మంత్రం జపిస్తే కూడా మంచి జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. పేదలకు అన్నదానం, పక్షులకు ఆహారం అందిస్తే మంచి జరిగి సంతోషంగా ఉండొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

E-Paper












