వినాయకుడుని బుధవారం నాడు ఎలా ఆరాధించాలి? పూజా విధానంతో పాటు చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోండి!

బుధవారం వ్రతం చేయాలనుకుంటే 7 లేదా 21 బుధవారాలు చేయాలి. వీటిని క్రమం తప్పకుండా చేయాలి. చివరి రోజు ఉద్యాపన ఉంటుంది. అయితే పితృపక్షంలో మాత్రం ఈ వ్రతాన్ని మొదలు పెట్టకూడదు. బుధవారం గణపతిని ఎలా పూజించాలి?, బుధవారం గణపతిని ఆరాదించేటప్పుడు ఏం చేయాలి, ఎలాంటి నియమాలను పాటించాలి వంటివి తెలుసుకుందాం.

Published on: Jun 11, 2025, 07:00:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ మతంలో వారానికి ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. బుధవారం నాడు గణపతిని ప్రత్యేకించి ఆరాధిస్తాము. బుధవారం ఎవరైతే భక్తిశ్రద్ధలతో వినాయకుడిని ఆరాధిస్తారో, వారు విశేష ఫలితాన్ని పొందుతారు. అనుకున్న పనులు కూడా పూర్తవుతాయి, విఘ్నాలు తొలగిపోతాయి.

బుధవారం వ్రతం (pinterest)
బుధవారం వ్రతం (pinterest)

బుధవారం ఉపవాసం వల్ల లాభాలు

బుధవారంనాడు ఉపవాసం ఉంటే మంచి జరుగుతుంది. జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. బుధవారం నాడు ఉపవాసం ఉండడం వలన ఆ జాతకంలో బుధుడు స్థానాన్ని బలపరచుకోవచ్చు.

ఉపవాసం ఎప్పటి నుండి మొదలుపెట్టాలి?

బుధవారం ఉపవాసంఉండాలనుకుంటే, మీరు ఏదైనా నెలలో శుక్లపక్ష బుధవారాన్ని చూసుకుని అప్పటి నుండి ఉపవాసాన్ని మొదలు పెట్టొచ్చు. విశాఖ నక్షత్రం ఉన్న బుధవారం అయితే మరీ మంచిది. బుధవారం వ్రతం చేయాలనుకుంటే 7 లేదా 21 బుధవారాలు చేయాలి. వీటిని క్రమం తప్పకుండా చేయాలి. చివరి రోజు ఉద్యాపన ఉంటుంది. అయితే పితృపక్షంలో మాత్రం ఈ వ్రతాన్ని మొదలు పెట్టకూడదు.

బుధవారం గణపతిని ఎలా పూజించాలి?

  1. బుధవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తల స్నానం చేయాలి.
  2. ఆకుపచ్చని దుస్తులు ధరిస్తే మరీ మంచిది.
  3. ఆ తర్వాత వినాయకుడిని పూజించాలి.
  4. ధూప, దీప, నైవేద్యాలని సమర్పించాలి.
  5. గరికగణపతికి ఎంతో ప్రీతికరమైనది. కనుక తప్పకుండా గరికను సమర్పించండి.
  6. వినాయకుడి మంత్రాలను చదివి హారతి ఇవ్వాలి.
  7. బుధవారం ఉపవాసం ఉన్నవారు కథను చదివి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి.

బుధవారం పూజ వల్ల లాభాలు

  • విఘ్నాలు తొలగిపోతాయి. మన పనులు పూర్తవుతాయి.
  • బుధవారంఉపవాసం ఉండడం వల్ల మనుషులకు ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది.
  • తప్పకుండా 7 లేదా 21 బుధవారాలు ఉపవాసాన్ని ఆచరించవచ్చు.
  • ఇలా గణపతిని ఆరాధించడం వల్ల ధన ధాన్యాలకు లోటు ఉండదు.
  • బుధవారం నాడు వీటిని కూడా తప్పక పాటించండి.
  • ఉదయంత్వరగా నిద్రలేవాలి. పండ్లు తిన్నా పర్వాలేదు. సాయంత్రం పూజ చేసిన తర్వాత భోజనం చేయవచ్చు.
  • బుధవారం ఉపవాసం ఉన్నప్పుడు ఆకుపచ్చ దుస్తులను పేదవారికి దానం చేయడం మంచిది. కూరగాయలు, పువ్వులు వంటివి కూడా ఇవ్వవచ్చు.
  • వినాయకుడికి బెల్లం సమర్పించవచ్చు. అలాగే అన్నాన్ని కూడా మహా నివేదనగా సమర్పించవచ్చు.
  • ఎర్రటి కెంపు రంగులో ఉండే తిలకాన్ని బుధవారం నాడు వినాయకుడి బొట్టు కింద పెట్టండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More