5 రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారి కష్టాలు తీరిపోతాయి.. కుజుని అనుగ్రహంతో అందమైన ప్రేమ జీవితం, ఆఫీసులో ప్రశంసలు ఇలా ఎన్నో!

మరో ఐదు రోజుల్లో కుజుడు నక్షత్ర మార్పు చేయబోతున్నాడు. కుజుడు నక్షత్రాన్ని మార్చడంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కానీ మూడు రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. మరి ఏ రాశులు వారికి కుజ నక్షత్ర సంచారం శుభ ఫలితాలను తీసుకువస్తుంది? ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయి?

Published on: Sep 17, 2025, 15:00:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అదే విధంగా నక్షత్రాలని కూడా మారుస్తూ ఉంటాయి. మరో ఐదు రోజుల్లో కుజుడు నక్షత్ర మార్పు చేయబోతున్నాడు. కుజుడు నక్షత్రాన్ని మార్చడంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది.

స్వాతి నక్షత్రంలోకి కుజుడు (pinterest)
స్వాతి నక్షత్రంలోకి కుజుడు (pinterest)

కానీ మూడురాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. మరి ఏ రాశులు వారికి కుజ నక్షత్ర సంచారం శుభ ఫలితాలను తీసుకువస్తుంది? ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

స్వాతి నక్షత్రంలోకి కుజుడు

సెప్టెంబర్ 23 మంగళవారం రాత్రి 9:08 కి కుజుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు. కుజ నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. ఏ రాశుల వారు ఊహించని ధన లాభాన్ని పొందుతారు? ఆర్థిక పరంగా సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. మరి ఆ మూడు అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

1.కన్యా రాశి:

కన్యా రాశి వారికి కుజుడి నక్షత్ర సంచారం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ రాశి వారు ఆర్థిక పరంగా సంతోషంగా ఉంటారు. ఉన్నత శిఖరాలని చేరుకుంటారు. ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు, టెన్షన్ తొలగిపోతాయి. కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి కూడా ఇది మంచి సమయం. ఈ రాశి వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది.

2.సింహ రాశి:

సింహ రాశి వారికి కుజ నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థికపరంగా సమస్యలను దూరంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో బంధం దృఢంగా మారుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్లను మొదలుపెడతారు. ఎప్పటి నుంచో తీరని కోరికలు సమయంలో తీరిపోతాయి.

3.ధనస్సు రాశి:

ధనస్సు రాశివారు ఈ నక్షత్ర సంచారం కారణంగా శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. కొత్త కారు లేదా ప్రాపర్టీలను కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. జీవిత భాగస్వామితో సంబంధం బలంగా మారుతుంది. మీరు చేసే పనులకు ప్రశంసలు దక్కుతాయి. మీ పనిని చూసి తోటి ఉద్యోగస్తులు మెచ్చుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More