ఆగస్టు నెలలో సూర్యుడితో సహా ప్రధాన గ్రహాల కదలికలో మార్పు, ఈ నాలుగు రాశులకు గోల్డెన్ డేస్.. ప్రమోషన్లు, విజయాలు ఇలా ఎన్నో
ఆగస్టు నెలలో రక్షాబంధన్, కృష్ణాష్టమి వంటి ముఖ్య పండుగలను జరుపుకుంటాము. ఆగస్టు నెలలోనే సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని కొన్ని ప్రత్యేక స్థానాల్లో ఉండడంతో కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. గ్రహాల సంచారం విపరీత రాజయోగం, గజ లక్ష్మి రాజయోగం, లక్ష్మీ నారాయణ యోగం వంటి అద్భుతమైన యోగాలను సృష్టిస్తుంది.
ఆగస్టు నెలలో కొన్ని గ్రహాల రాశి మార్పు చెందడంతో రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఇది కొన్ని రాశుల వారికి ఎన్నో శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఆగస్టునెలలో ఏ గ్రహాలు మార్పు చెందుతాయి, ఏ రాశుల వారికి కలిసి వస్తుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు నెలలో అనేక పండగలు వస్తున్నాయి. ఆగస్టు నెలలో రక్షాబంధన్, కృష్ణాష్టమి వంటి ముఖ్య పండుగలను జరుపుకుంటాము. ఆగస్టు నెలలోనే సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని కొన్ని ప్రత్యేక స్థానాల్లో ఉండడంతో కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది.
ఆగస్టు నెలలో ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలవుతాయి (pinterest)
ఆగస్టు నెలలో ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు
గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడుఆగస్టు నెలలో కర్కాటక రాశిలో ఉంటాడు. ఆ తర్వాత ఆగస్టులోనే సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు కన్యా రాశిలో ఉంటాడు. అదేవిధంగా శని మీన రాశిలో తిరోగమనంలో ఉంటాడు. బుధుడు నేరుగా ఉండి, ఆ తర్వాత అస్తమిస్తాడు. ఇలా గ్రహాలసంచారం విపరీత రాజయోగం, గజ లక్ష్మి రాజయోగం, లక్ష్మీ నారాయణ యోగం వంటి అద్భుతమైన యోగాలను సృష్టిస్తుంది. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది.
ఆగస్టు నెలలో ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలవుతాయి
1.మేష రాశి:
మేషరాశి వారికి ఆగస్టు నెలలో కలిసి వస్తుంది. ఈ రాశి వారికి శని సడే సతి కొనసాగుతుంది కానీ ఈ సమయంలో శని తిరోగమనంలో ఉండడం వల్ల దుష్పరిణామాలు ఎక్కువగా ఉండవు. పనిలో బిజీగా ఉంటారు. పెట్టుబడి ద్వారా డబ్బు సంపాదిస్తారు. చిక్కుకున్న డబ్బును కూడా పొందుతారు. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది.
2.సింహ రాశి:
సింహ రాశివారికి శని సడే సతి ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కెరియర్‌లో బెనిఫిట్స్ పొందుతారు. బాధ్యతలు పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. కొత్త ఉద్యోగం కూడా వస్తుంది. జీవితంలో సంతోషం, ప్రశాంతత ఉంటాయి.
3.తులా రాశి:
తులా రాశివారికి ఆగస్టు నెలలో మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. ఎక్కువ డబ్బును ఆదా చేస్తారు.
4.మకర రాశి:
మకరరాశి వారు ఎప్పటినుంచో బాధపడుతున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. ఉద్యోగస్తులు సక్సెస్ అందుకుంటారు. ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.