జూలైలో గురువు, శనితో సహా 6 పెద్ద గ్రహాలు సంచారం.. ఆరు రాశుల వారికి పురోగతి, సంపదతో పాటు ఎన్నో!

గురువు, శుక్రుడు, కుజుడు, బుధుడు, సూర్యుడు, శని తమ తమ రాశులను మారుస్తున్నారు. వీటి రాశి మార్పు కారణంగా 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆరు రాశుల వారికి అనేక లాభాలు ఉంటాయి. కొన్ని రాశుల వారి ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. 

Published on: Jun 27, 2025 10:30 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. జూలై నెలలో కూడా కొన్ని గ్రహాలు రాశిని మారుస్తున్నాయి. జూలై నెలలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు గ్రహాలమార్పు ఉంది. గురువు, శుక్రుడు, కుజుడు, బుధుడు, సూర్యుడు, శని తమ తమ రాశులను మారుస్తున్నారు. వీటి రాశి మార్పు కారణంగా 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది.

జూలైలో గురువు, శనితో సహా 6 పెద్ద గ్రహాలు సంచారం (pinterest)
జూలైలో గురువు, శనితో సహా 6 పెద్ద గ్రహాలు సంచారం (pinterest)

ముఖ్యంగా ఆరు రాశులవారికి అనేక లాభాలు ఉంటాయి. కొన్ని రాశుల వారి ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. దాంతో పాటుగా చాలా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

జూలై నెలలో ఆరు గ్రహాల సంచారంలో మార్పులు:

  • జూలై 9, బుధవారం – మిథునరాశిలో గురువు, సమయం: రాత్రి 10:50
  • జూలై 13, ఆదివారం – మీన రాశిలో శని, సమయం: ఉదయం 7:24
  • జూలై 16, బుధవారం – కర్కాటక రాశిలోకి సూర్యుడు, సమయం: సాయంత్రం 5:17
  • జూలై 18, శుక్రవారం – కర్కాటక రాశిలో బుధుడు, సమయం: ఉదయం 9:45
  • జూలై 24, గురువారం – కర్కాటక రాశిలో బుధుని ఉదయం, సమయం: రాత్రి 7:42
  • జూలై 26, శనివారం – మిథున రాశిలో శుక్రునిసంచారం, ఉదయం 8:45
  • జూలై 28, సోమవారం – కన్య రాశిలో కుజుని సంచారం, సమయం: రాత్రి 7:02

ఆరు గ్రహాల సంచారంతో ఈ రాశులకు బోలెడు లాభాలు

1.మేష రాశి

మేష రాశివారికి జూలై నెల కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక శుభ ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కార్యాలయంలో మీ అద్భుతమైన పనితీరుతో ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసం, నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతాయి.

శనిప్రభావం తగ్గడం వలన కుటుంబంలో చికాకులు, ఖర్చులు కూడా తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత విషయాల్లో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. వివాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి.

2.వృషభ రాశి

వృషభరాశి వారికి జూలై నెల కలిసి వస్తుంది. ఎప్పటినుంచి పూర్తిగా బాధ్యతలను తీసుకుంటారు. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఎప్పటి నుంచో రాని ధనం మీ చేతికి అందుతుంది. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది.

3.మిథున రాశి

మిథునరాశి వారికి జూలై నెల బాగుంటుంది. కెరీర్‌లో ఇబ్బందులు తొలగిపోతాయి. వాయివాహిక జీవితంలో సమస్యలు ఉండవు. కొత్త అవకాశాలు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి కూడా బావుంటుంది.

4.కన్యా రాశి

కన్యా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. జూలై నెలలో ఈ రాశి వారు పని ప్రదేశంలో ప్రశంసలు పొందుతారు. కన్యా రాశి విద్యార్థులకు కూడా సక్సెస్ ఉంటుంది. ఇల్లు లేదా ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం.

5.వృశ్చిక రాశి

వృశ్చికరాశి వారికి జూలై నెల కలిసి వస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. లాభాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.

6.కుంభ రాశి

కుంభ రాశి వారికి జూలై నెలలో సానుకూల మార్పులు ఉంటాయి. ఇక జీవితంలో సంతోషం ఉంటుంది. వ్యాపారులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్లే వారికి కూడా ఈ సమయం బాగుంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఈ సమయంలో కలిసి వస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

News/Rasi Phalalu/జూలైలో గురువు, శనితో సహా 6 పెద్ద గ్రహాలు సంచారం.. ఆరు రాశుల వారికి పురోగతి, సంపదతో పాటు ఎన్నో!
News/Rasi Phalalu/జూలైలో గురువు, శనితో సహా 6 పెద్ద గ్రహాలు సంచారం.. ఆరు రాశుల వారికి పురోగతి, సంపదతో పాటు ఎన్నో!