జూలైలో కేతువు నక్షత్ర మార్పు, 3 రాశుల వారికి బోలెడు లాభాలు.. ధనం, కొత్త అవకాశాలతో పాటు ఎన్నో!

కేతువు నక్షత్ర మార్పు మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో, ఈ మూడు రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. కొత్త అవకాశాలు రావడంతో పాటు, ఆర్థిక పరంగా కూడా లాభాలను పొందుతారు. కేతువు నక్షత్ర సంచారం వలన, ఏ రాశుల వారికి లాభాలు ఉంటాయి?

Published on: Jun 28, 2025 12:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూలై 6న మధ్యాహ్నం 1:32 నిమిషాలకు, కేతువు పూర్వఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. జూలై 20 మధ్యాహ్నం 2:10 నిమిషాల వరకు ఉంటాడు. కేతువు నీడ గ్రహం. అందులోనూ తిరోగమనంచెందుతాడు. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది.

జూలైలో కేతువు నక్షత్ర మార్పు
జూలైలో కేతువు నక్షత్ర మార్పు

కానీ కొన్ని రాశులవారికి మాత్రం అనేక విధాలక లాభాలను అందిస్తుంది. మరి ఇది ఏ రాశుల వారికి లాభాలను అందిస్తుంది, ఎవరు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కేతువు నక్షత్ర మార్పు

కేతువు నక్షత్ర మార్పు మూడురాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో, ఈ మూడు రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. కొత్త అవకాశాలు రావడంతో పాటు, ఆర్థిక పరంగా కూడా లాభాలను పొందుతారు. కేతువు నక్షత్ర సంచారం వలన, ఏ రాశుల వారికి లాభాలు ఉంటాయి, ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలు ఉంటాయి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కేతువు నక్షత్ర సంచారంతో ఈ మూడు రాశుల వారికి బోలెడు లాభాలు:

1.వృషభ రాశి:

వృషభ రాశి వారికి, కేతువు నక్షత్ర సంచారం అనేక విధాలుగా లాభాలను అందిస్తుంది. ఈ సమయంలో, ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. పని ప్రదేశంలో మీ పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి, ఇంటర్వ్యూకి వెళ్లాలనుకునే వారికి, ఈ సమయం బాగుంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది.

2.తులా రాశి:

తులా రాశి వారికి, కేతువు నక్షత్ర సంచారం అదృష్టం తీసుకువస్తుంది. ఈ సమయంలో, ఈ రాశి వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిదీ సరిగ్గా అర్థం చేసుకుంటారు. జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న పనులు, ఈ సమయంలో పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో కూడా సానుకూలత ఉంటుంది. కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి కూడా ఇది మంచి సమయం.

3.కుంభ రాశి:

కుంభ రాశి వారికి, కేతువు నక్షత్ర సంచారం అనేక విధాలుగా లాభాలను అందిస్తుంది. ఈ సమయంలో, ఈ రాశి వారు సంతోషాన్ని పొందుతారు. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సక్సెస్‌ను అందుకుంటారు. సంతోషంగా ఉంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

News/Rasi Phalalu/జూలైలో కేతువు నక్షత్ర మార్పు, 3 రాశుల వారికి బోలెడు లాభాలు.. ధనం, కొత్త అవకాశాలతో పాటు ఎన్నో!
News/Rasi Phalalu/జూలైలో కేతువు నక్షత్ర మార్పు, 3 రాశుల వారికి బోలెడు లాభాలు.. ధనం, కొత్త అవకాశాలతో పాటు ఎన్నో!