ఇంట్లో పక్షి గూడు ఉంటే మంచిదా, కాదా? వాస్తు శాస్త్రం ఏం చెప్తోందో తెలుసుకోండి!
వాస్తు ప్రకారం చాలా మంది తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. దాని వలన పెద్ద నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు పక్షి గూడుకి సంబంధించి కొన్ని వాస్తు నియమాలని తెలుసుకుందాం. ఇంట్లో పక్షి గూడు ఉంటే మంచిదా కాదా? ఏమైనా నష్టం కలుగుతుందా అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.
చాలామంది వాస్తుప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన చాలా సమస్యలు తొలగిపోతాయి, సంతోషంగా కూడా ఉండొచ్చు. వాస్తు ప్రకారం చాలా మంది తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. దాని వలన పెద్ద నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటిని నిర్మించడానికి మొదలు, ఇంట్లో ఏ వస్తువులు ఏ దిశలో ఉంచాలి అనే దాని వరకు చాలా మంది రకరకాల వాస్తు పరిహారాలని, వాస్తు చిట్కాలని పాటిస్తూ ఉంటారు.

ఈరోజు పక్షిగూడుకి సంబంధించి కొన్ని వాస్తు నియమాలని తెలుసుకుందాం. ఇంట్లో పక్షి గూడు ఉంటే మంచిదా కాదా, పక్షి గూడు ఉండచ్చా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. మరి, ఇంట్లో పక్షి గూడు ఉండచ్చా, దాని వలన ఏమైనా నష్టం కలుగుతుందా అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.
ఇంట్లో పక్షి గూడు ఉంటే మంచిదా, కాదా?
మామూలుగా మనం చాలా రకాల పక్షులను మన ఇంటి దగ్గర లేదా బాల్కనీలో కానీ, గార్డెన్‌లో ఉండడం కానీ చూస్తూ ఉంటాం. కొంతమంది దీనిని మామూలుగానే తీసుకుంటారు. కానీ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, పక్షులు ఇంటికి వచ్చి గూడు కట్టుకోవడం అదృష్టానికి భావించాలి. కొన్ని పక్షుల రాక ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగిస్తుంది, ఇబ్బందులను తొలగిస్తుంది. కానీ కొన్ని పక్షులు గూళ్లు ఉండడం మంచిది కాదు. మరి ఏ పక్షి గూడు ఇంట్లో ఉంటే మంచిది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1.పిచ్చుక గూడు
ఇంట్లోపిచుక గూడు ఉండడం వలన ఎన్నో మంచి ఫలితాలను చూడవచ్చు. హిందూ సంస్కృతిలో పిచుకను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ గూడు ఇంట్లో ఉంటే ఆనందం, శాంతి, కుటుంబ ఐక్యత, శ్రేయస్సు కలుగుతాయి. సానుకూల శక్తి కూడా ఆ ఇంట్లో ప్రవహిస్తుంది. కుటుంబంలో కొన్ని శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయని దీనికి సంకేతం. సంతానం, ఆర్థిక శ్రేయస్సును కూడా పొందవచ్చు.
2.మైనా
మైనా పక్షులు ఇంట్లో గూడు కడితే శుభంజరుగుతుంది. ఇంట్లో ప్రేమనురాగాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండవచ్చు. రిలేషన్‌షిప్‌లో కూడా ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
3.చిలుక
చిలుకఇంట్లో గూడు కడితే చాలా మంచి జరుగుతుంది. చిలుక తెలివితేటలు, అదృష్టానికి చిహ్నం. చిలుక గూడు ఇంట్లో ఉంటే శుభవార్తలు వస్తాయి. ఇంట్లో చిలుక గూడు ఉండడం వలన పిల్లలు చదువులో ముందుంటారు, కెరీర్‌లో కూడా బాగా రాణిస్తారు.
పక్షుల గూడు కట్టినప్పుడు ఈ పొరపాట్లు చేయకండి:
- చాలా మంది పక్షి గూడును ఇంటి నుంచి తొలగించి, పక్షులకు హాని చేస్తారు. కానీ అలా చేయకూడదు.
- ఇంట్లోకి పక్షులు వచ్చినప్పుడు వాటికి ఆహారం వేయడం వలన ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి సంతోషంగా ఉండవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper













