జూలై 21న కామిక ఏకాదశి.. ప్రాముఖ్యత, పూజా విధానం, పరిహారాల పూర్తి వివరాలు ఇవిగో!

కామిక ఏకాదశి నాడు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకించి లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఆరాధించడం వలన సంతోషంగా ఉండొచ్చు, సకల బాధలు తీరుతాయి. కామిక ఏకాదశి తేదీ, సమయంతో పాటు ప్రాముఖ్యత, పూజా విధానం, పరిహారాల పూర్తి వివరాలు తెలుసుకోండి.

Published on: Jul 17, 2025 3:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏకాదశికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి నెల శుక్ల పక్షంలో, కృష్ణ పక్షంలో రెండు ఏకాదశులు వస్తాయి. ఆషాడమాసం కృష్ణ పక్ష ఏకాదశి కామిక ఏకాదశి అని అంటారు. కామిక ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ సంవత్సరం కామిక ఏకాదశి ఎప్పుడు వచ్చింది? కామిక ఏకాదశి శుభ సమయం, పరిహారాలు గురించి తెలుసుకుందాం.

జూలై 21న కామిక ఏకాదశి (pinterest)
జూలై 21న కామిక ఏకాదశి (pinterest)

ఈ ఏడాది కామిక ఏకాదశి ఎప్పుడు వచ్చింది?

ఈ ఏడాది కామిక ఏకాదశిజూలై 20న వచ్చిందా, 21న వచ్చిందా అనే సందేహం చాలా మందిలో ఉంది. పంచాంగం ప్రకారం చూసినట్లయితే జూలై 20 మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశి తిథి మొదలవుతుంది, జూలై 21 ఉదయం 9:38 వరకు ఉంటుంది. ఈ లెక్కన జూలై 21న కామిక ఏకాదశిని జరుపుకోవాలి.

విష్ణువు, లక్ష్మీదేవిని ఆరాధించండి

కామిక ఏకాదశి నాడు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకించి లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఆరాధించడం వలన సంతోషంగా ఉండొచ్చు, సకల బాధలు తీరుతాయి. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు జూలై 20 మధ్యాహ్నం మొదలుపెట్టి జూలై 21 ఉదయం వరకు ఉండొచ్చు. జూలై 22 ఉదయం 5:37 నుంచి 7:05 గంటల మధ్య ఉపవాసాన్ని విరమించవచ్చు.

కామిక ఏకాదశి నాడు ఏ విధంగా పూజ చేయాలి?

కామిక ఏకాదశి నాడు ఉదయాన్నే తలస్నానం చేసి, విష్ణువు స్వరూపమైన కృష్ణుడిని పూజించాలి. నెయ్యితో దీపారాధన చేసి శ్రీకృష్ణుడిని ఆరాధించాలి. ఈ రోజు విష్ణు సహస్రనామం మంత్రాలను జపిస్తే మంచి జరుగుతుంది. శివకేశవులు అనుగ్రహం కలగాలంటే భజనలు చేయడం మంచిది. ఉపవాసం ఉండేవారు దేవాలయాలను సందర్శించడం వలన కూడా ప్రయోజనాలను పొందవచ్చు.

కామిక ఏకాదశి విశిష్టత:

పాపాల నుంచి విముక్తి పొందడానికి కామిక ఏకాదశి ఎంతో మంచిది. ఆ రోజున ఏకాదశి వ్రతం చేస్తే మోక్షం కలుగుతుంది. ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యంకలుగుతుంది. ఆ రోజున విష్ణుమూర్తిని ఆరాధించడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారు.

ఎలాంటి పరిహారాలు పాటించాలి?

  • శుభకార్యాలు చేయడానికి కామిక ఏకాదశి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పనిని మొదలు పెడితే అది విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్థిక శ్రేయస్సు, ఐశ్వర్యం కూడా కలుగుతుంది.
  • శివలింగానికి అభిషేకం చేసి ఉమ్మెత్త పూలు, బిల్వపత్రాలు, జమ్మి పత్రాలను సమర్పిస్తే కూడా మంచిది.
  • 'ఓం నమః శివాయ' మంత్రాన్ని జపిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.
  • అదే విధంగా మహామృత్యుంజయ మంత్రం, శివ చాలీసా, రుద్రాష్టకం పఠిస్తే కూడా ఎంతో మంచి ఫలితాన్ని పొందవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

News/Rasi Phalalu/జూలై 21న కామిక ఏకాదశి.. ప్రాముఖ్యత, పూజా విధానం, పరిహారాల పూర్తి వివరాలు ఇవిగో!
News/Rasi Phalalu/జూలై 21న కామిక ఏకాదశి.. ప్రాముఖ్యత, పూజా విధానం, పరిహారాల పూర్తి వివరాలు ఇవిగో!