...
...
Next Story

జూన్ 25న నిర్జల ఏకాదశి.. అదృష్టం, సిరి సంపదల కోసం ఈ సులువైన, శక్తివంతమైన పరిహారాలు పాటించండి!

ఈ ఏడాది నిర్జల ఏకాదశి జూన్ 25న వస్తోంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా ఆరాధించడం వల్ల అపారమైన పుణ్యఫలాలతో పాటు ఆర్థిక సమస్యలు తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ విశేష ఫలితాల కోసం పాటించాల్సిన పరిహారాలు ఇవే!

Published on: Jun 22, 2026, 11:00:35 IST
Advertisement

ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశులలో 'నిర్జల ఏకాదశి'కి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ ఏకాదశి నాడు అన్నపానీయాలు లేకుండా ఉపవాసం ఉండి, శ్రీహరిని ఆరాధించడం వల్ల మిగిలిన అన్ని ఏకాదశుల ఫలితం దక్కుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. భానుడి ప్రతాపం ఎక్కువగా ఉండే ఈ కాలంలో, నీటి చుక్క కూడా తీసుకోకుండా చేసే ఈ కఠిన వ్రతం భక్తికి, త్యాగానికి నిదర్శనం. ఈ పవిత్ర దినాన కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం ద్వారా మీ జీవితంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.

2026లో నిర్జల ఏకాదశి ఎప్పుడు?

జూన్ 25న నిర్జల ఏకాదశి.. అదృష్టం, సిరి సంపదల కోసం ఈ సులువైన, శక్తివంతమైన పరిహారాలు పాటించండి!
జూన్ 25న నిర్జల ఏకాదశి.. అదృష్టం, సిరి సంపదల కోసం ఈ సులువైన, శక్తివంతమైన పరిహారాలు పాటించండి!

హిందూ పంచాంగం ప్రకారం, జ్యేష్ఠ మాస శుక్ల పక్ష ఏకాదశి తిథి జూన్ 24, 2026 సాయంత్రం 06:12 గంటలకు ప్రారంభమై, జూన్ 25 సాయంత్రం 08:09 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రామాణికంగా, భక్తులు జూన్ 25, 2026న ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి.

ఆర్థిక వృద్ధి కోసం పాటించాల్సిన పరిహారాలు

నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును అనుగ్రహింపజేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు ఇవే:

జలాభిషేకం: పవిత్ర గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేయండి. ఇది మనసును, ఇంటిని శుద్ధి చేస్తుంది.

తిలకం: భగవంతుడికి పసుపు రంగు చందనాన్ని తిలకంగా దిద్దండి. ఇది సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.

నైవేద్యం: విష్ణువుకు శనగపప్పు, బెల్లం, లడ్డూలను నైవేద్యంగా సమర్పించండి.

మంత్ర పఠనం: "ఓం నమో భగవతే వాసుదేవాయ", "ఓం విష్ణవే నమః" వంటి నామాలను భక్తితో పఠించండి. శ్రీ విష్ణు సహస్రనామ లేదా విష్ణు చాలీసా పఠించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది.

పసుపు వస్త్రాలు: శ్రీహరికి పసుపు రంగు వస్త్రాలను సమర్పించండి. పసుపు రంగు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది.

ఇతర ఆచారాలు - పుణ్యఫలాలు

తులసి ఆరాధన: ఈ రోజున తులసి మాతకు ప్రత్యేక పూజలు చేసి, లక్ష్మీదేవికి అలంకరణ సామగ్రిని సమర్పించండి.

దీపారాధన: రావి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించడం వల్ల గ్రహ దోషాలు తొలగి, శుభం కలుగుతుంది.

గ్రంథ పఠనం: అవకాశం ఉంటే భాగవతం పఠించడం లేదా వినడం చేయండి. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూలతలను తొలగించి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతుంది.

నిర్జల ఏకాదశి వ్రతం శారీరక నిగ్రహానికి, మానసిక ప్రశాంతతకు నిదర్శనం. భక్తితో చేసే ప్రతి ప్రయత్నం విష్ణుమూర్తి కరుణాకటాక్షాలను మీకు అందిస్తుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks