నేటి నుంచి నిజ జ్యేష్ఠ మాసం.. ఈ నెలలో చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోండి!

అధిక జ్యేష్ఠ మాసం ముగియడంతో నేటి నుంచి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమైంది. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఈ మాసంలో దానధర్మాలు, ఉపవాసాలు, దేవతారాధనలు చేయడం వల్ల విశేష పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జ్యేష్ఠ మాసంలో నీటి దానం, నువ్వుల దానం శుభప్రదంగా భావిస్తారు.

Published on: Jun 16, 2026, 08:00:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ ఏడాది అధిక జ్యేష్ఠ మాసం వలన జ్యేష్ఠ మాసం 60 రోజులు వచ్చింది అధిక జ్యేష్ఠ మాసం నిన్న అధిక జ్యేష్ఠ అమావాస్యతో పూర్తయిపోయింది. ఈరోజు నుంచి నిజ జ్యేష్ఠ మాసం మొదలైంది. హిందూ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే ఇది మూడవ నెల. ఉత్తరాది వారికి జ్యేష్ఠ మాసంలో కొన్ని పనులు చేయడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ నెల రోజులు కూడా జ్యేష్ఠ మాసానికి సంబంధించిన పరిహారాలను పాటించొచ్చు. ఈరోజు జ్యేష్ఠ మాసంలో చేయాల్సిన పనులతో పాటు, జ్యేష్ఠ మాసం పేరు ఎలా వచ్చిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నేటి నుంచి నిజ జ్యేష్ఠ మాసం.. ఈ నెలలో చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోండి! (pinterest)
నేటి నుంచి నిజ జ్యేష్ఠ మాసం.. ఈ నెలలో చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోండి! (pinterest)

జ్యేష్ఠ మాసం చాలా ఫలితమైనది

జ్యేష్ఠ మాసాన్ని చాలా ఫలితమైనదిగా భావిస్తారు. ఈ నెలలో దానధర్మాలు చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాగే ఈ నెలలో చేసే ఉపవాసాలు కూడా ఎన్నో శుభ ఫలితాలను తీసుకువస్తాయి.

జ్యేష్ఠ మాసం అనే పేరు ఎలా వచ్చింది?

జ్యేష్ఠ మాసంలో ఇతర నెలల కంటే పగలు ఎక్కువగా, రాత్రి తక్కువగా ఉంటుంది. ఎక్కువ పొడవు ఉన్న దానినే సంస్కృతంలో "జ్యేష్ఠ" అంటారు. అందుకనే ఈ నెలకు జ్యేష్ఠ మాసం అని పేరు వచ్చింది. జ్యేష్ఠ మాసానికి అధిపతి కుజుడు.

జ్యేష్ఠ మాసంలో ఈ పనులు చేస్తే చాలా మంచిది

జ్యేష్ఠ మాసంలో స్నానాలకు, దానధర్మాలకు ఎంతో శుభ ఫలితం వస్తుంది. ఈ నెలలో కొన్ని నియమాలను కూడా పాటిస్తే మంచిది.

జ్యేష్ఠ మాసంలో నీటిని దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది.

సూర్యోదయానికి ముందు స్నానం చేసి సూర్యుని పూజించి అర్ఘ్యం సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

అలాగే ఈ నెలలో పగటి పూట నిద్రపోకూడదు. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే కాసేపు నిద్రపోవచ్చు.

ఈ నెలలో నువ్వులను దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. జ్యేష్ఠ మాసంలో మొక్కలు, జంతువులు, పక్షులకు సేవ చేయడం కూడా శుభ ఫలితాలను తీసుకొస్తుంది. కుండలో నీటి దానం చేయడం వలన ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

జ్యేష్ఠ మాసానికి అధిపతి కుజుడు కాబట్టి ఈ నెలలో హనుమంతుని ఆరాధిస్తే మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు.

కొన్ని పొరపాట్లు చేయడం వలన ఇబ్బందులు వస్తాయి

జ్యేష్ఠ మాసంలో కారంగా ఉండే ఆహార పదార్థాలను, వెల్లుల్లిని తినకూడదు.

వంకాయ తినడం కూడా నిషేధించబడింది. ఇది పిల్లలకు హాని చేస్తుందని అంటారు.

ఆయుర్వేదం ప్రకారం జ్యేష్ఠ మాసంలో శరీరంలో వాత, వేడి పెరుగుతాయట. కాబట్టి వాతావరణానికి తగ్గట్టుగా ఆహార పదార్థాలను తీసుకోవాలి.

జ్యేష్ఠ మాసంలో ఇలా చేస్తే మంచిది

జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఇష్టమైన నెల. ఈ నెలలో గోధుమపిండితో బ్రహ్మదేవుని ప్రతిమ చేసి పూజిస్తే విశేషమైన ఫలితాలను పొందవచ్చు. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే అనంత ఫలితాన్ని పొందవచ్చు. జ్యేష్ఠ మాసంలో జలదానం చేయడం కూడా ఉత్తమ ఫలితాలను అందిస్తుంది.

మహా జ్యేష్ఠి

జ్యేష్ఠ పూర్ణిమను మహా జ్యేష్ఠి అంటారు. ఆ రోజున నువ్వులను దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది. గొడుగు, చెప్పులను దానం చేస్తే కూడా మంచిది. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కలశం, జలం, గంధం వంటివి దానం చేస్తే కూడా మంచిది. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని దశహరా అని అంటారు. దుర్దశలను పోగొట్టే శక్తి దీనికి ఉంది. ఆ రోజున నదీ స్నానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి రోజు విష్ణువును ఆరాధించి ఉపవాసం ఉంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More