జూన్ 15తో ముగియనున్న జ్యేష్ట అధిక మాసం.. ఇక శుభముహూర్తాలు.. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు!
Jyeshta Adhika Masam June 15 : జూన్ 15తో జ్యేష్ట అధిక మాసం ముగియనుంది. జూన్ 16 నుండి తెలుగు రాష్ట్రాల్లో శుభముహూర్తాలు, పెళ్లిళ్ల సందడి షురూ కానుంది.
గత కొంతకాలంగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాల కోసం ఎదురుచూస్తున్న వారికి అప్డేట్. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న జ్యేష్ట అధిక మాసం జూన్ 15వ తేదీతో ముగియనుంది. జూన్ 16 నుండి నిజ జ్యేష్ట మాసం (శుద్ధ మాసం) ప్రారంభం కానుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మళ్లీ శుభముహూర్తాల జాతర మొదలుకానుంది.

అధిక మాసం కారణంగా గత నెల రోజులుగా నిలిచిపోయిన శుభకార్యాల సందడి, జూన్ మూడో వారం నుండి తెలుగు రాష్ట్రాల ఇళ్లలో మళ్లీ ప్రారంభం కాబోతోంది. శాస్త్రాల ప్రకారం అధిక మాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు. సాధారణంగా పెద్దలు శూన్యాలు అంటుంటారు. ఈ సమయంలో విశ్వంలో శుభ శక్తుల ప్రభావం తక్కువగా ఉంటుందని నమ్ముతారు. అందుకే ఈ కాలంలో పెళ్లిళ్లు, శంకుస్థాపనలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వంటి శుభకార్యాలను నిషిద్ధంగా భావిస్తారు.
జూన్ 15న అధిక మాస శూన్య రోజులు ముగిసిన వెంటనే, జూన్ 16 నుండి సరికొత్త శుభ ముహూర్తాలు అందుబాటులోకి రానున్నాయి. పంచాంగ శ్రవణాల ప్రకారం జూన్ ద్వితీయార్థంలో, జూలై, ఆగస్టు నెలల్లో భారీగా వివాహ ముహూర్తాలు ఉన్నాయి.
వివాహ ముహూర్తాలు : జూన్ 18, 21, 24, 25, 29 తేదీల్లో బలమైన లగ్నాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు.
గృహప్రవేశాలు : జూన్ చివరి వారంలో, జూలై మొదటి వారంలో మంచి తిథులు ఉన్నాయి.
వ్యాపార ప్రారంభాలు : జూన్ 17 బుధవారం, జూన్ 19 శుక్రవారం రోజులు నూతన పనులకు అనుకూలంగా ఉన్నాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
శుభముహూర్తాలు ఒకేసారి ప్రారంభం అవుతుండటంతో మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరగనుంది. కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు ముహూర్తాలు తక్కువగా ఉన్న రోజుల్లో హాల్స్ దొరకడం కష్టం కాబట్టి ఇప్పుడే అడ్వాన్స్ చేసుకోవడం ఉత్తమం. పురోహితులు, క్యాటరింగ్ సర్వీసెస్ వారి డేట్స్ ముందే లాక్ చేసుకోండి. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైతే డిమాండ్ పెరిగి బంగారం ధరలు కూడా మారే అవకాశం ఉంటుంది.
గమనిక : ప్రాంతాన్ని బట్టి, మీ పిల్లల నక్షత్ర బలాన్ని బట్టి ముహూర్తాల సమయాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. మీ కుటుంబ పురోహితులను లేదా పంచాంగకర్తలను సంప్రదించి కచ్చితమైన లగ్న సమయాలను నిర్ణయించుకోగలరు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


