TGSRTC : శ్రీరామనవమికి ఇలా చేస్తే.. మీ ఇంటికే రాములవారి కళ్యాణ తలంబ్రాలు

భద్రచాలం శ్రీరాములవారి కళ్యాణ తలంబ్రాలు మీ ఇంటి వద్దకే రావాలా? అయితే టీజీఎస్ఆర్టీసీ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అతి తక్కువ ధరలోనే తలంబ్రాలు అందుకోవచ్చు.

Published on: Feb 27, 2026, 06:19:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మార్చి 27వ తేదీన శ్రీరామనవమి. ఈ సందర్భంగా భద్రాచలంలో రాములవారి కళ్యాణం ఎంత వైభవంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాములవారి కళ్యాణంలోని తలంబ్రాలకు చాలా ప్రత్యేకత ఉంది. భక్తులు పవిత్రంగా భావిస్తారు. వాటిని కావాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మీ ఇంటి వద్దే శ్రీరాములవారి కళ్యాణం తలంబ్రాలు పొందవచ్చు.

రాములవారి కళ్యాణ తలంబ్రాలు
రాములవారి కళ్యాణ తలంబ్రాలు

భక్తులు రూ.151 చెల్లించి.. https://tgsrtclogistics.co.in/TSRTC/ లేదంటే సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో బుకింగ్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం 040-69440069, 040-23450033ని సంప్రదించండి. ఇప్పటి నుంచి బుకింగ్ చేయవచ్చు.

మీరు ఉమ్మడి నిజామాబాద్‌వాసులైతే రూ.151కి ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా భద్రాచలం శ్రీరామ ఆలయం నుండి పవిత్రమైన కల్యాణ తలంబ్రాలును వారి ఇంటి వద్దనే పొందవచ్చని ప్రాంతీయ మేనేజర్ టి. జోస్నా చెప్పారు. మార్చి 27న శ్రీరామ నవమి పండుగ సందర్భంగా రాములొరి తలంబ్రాలకు కావాలనుకునేవారి కోసం అవకాశం ఉందన్నారు.

tgsrtclogistics.co.in వెబ్‌సైట్ ద్వారా లేదా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని అన్ని ఆర్టీసీ కార్గో కౌంటర్లలో బుకింగ్‌లు చేసుకోవచ్చన్నారు. భక్తులు ఈ సేవను పొందాలని ప్రాంతీయ జోస్నా తెలిపారు. వివరాల కోసం,

ఆర్మూర్ డిపో – 7396889496

బోధన్ డిపో – 9154298729

నిజామాబాద్-1 డిపో – 9154298727

నిజామాబాద్-2 డిపో – 7396889496

బాన్సువాడ డిపో – 9154298729

కామారెడ్డి డిపో – 9154298729

ప్రాంతీయ మేనేజర్ కార్యాలయం – 8639969647

మార్చి 27వ తేదీన శ్రీరామనవమి జరగనుంది. భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. రాములవారికి తలంబ్రాలు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తయారు చేసి పంపిస్తారు. స్వామి కళ్యాణం సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సు సర్వీసులను భద్రచలానికి నడుపుతాయి. ఈ సమయంలో భక్తుల రద్దీ కారణంగా అదనపు సర్వీసులు ఉంటాయి. సీతారామచంద్రుల కల్యాణోత్సవం తలంబ్రాలు కావాలంటే బుక్ చేసుకుంటే మీ ఇంటి వద్దకే వస్తాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More