గురువు-చంద్రుని కలయికతో గజకేసరి రాజయోగం, ఈ మూడు రాశులకు బోలెడు లాభాలు.. ఇల్లు, వాహనాలు, విజయాలు, వాహనాలు ఇలా ఎన్నో!

గ్రహాల మార్పు 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. గ్రహాలు శుభయోగాలను, అశుభయోగాలను కూడా తీసుకువస్తూ ఉంటాయి. త్వరలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. గురువు-చంద్రుని కలయికతో ఈ రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా శక్తివంతమైనది. ఇది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. 

Published on: Jul 16, 2025 3:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. గ్రహాలమార్పు 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. గ్రహాలు శుభయోగాలను, అశుభయోగాలను కూడా తీసుకువస్తూ ఉంటాయి. త్వరలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. గురువు-చంద్రుని కలయికతో ఈ రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా శక్తివంతమైనది.

గజకేసరి యోగం (pixabay)
గజకేసరి యోగం (pixabay)

గజకేసరి రాజయోగం

జూలై 22 ఉదయం 8:14కు చంద్రుడుమిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. గురువు ఇప్పటికే ఈ రాశిలో ఉండడం వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ మూడు రాశుల వారికి మాత్రం మంచి జరుగుతుంది. ఈ గజకేసరి రాజయోగంతో ఈ రాశులకే బోలెడు లాభాలు.

1.మిథున రాశి:

గజకేసరి రాజయోగం మిథునరాశిలో ఏర్పడుతుంది. మిథున రాశి వారికి ఇది శుభ ఫలితాలను అందిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీగా లాభాలు పొందుతారు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి. మీ తండ్రి సహాయంతో సక్సెస్‌ను సులభంగా అందుకుంటారు.

2.సింహ రాశి:

సింహ రాశి వారికి గజకేసరి రాజయోగం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో సంతోషం ఉంటుంది. పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఇల్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

3.కన్య రాశి:

కన్య రాశివారికి కూడా గజకేసరి రాజయోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో కన్య రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. అనుకున్న ప్రతి వాటిలో విజయాన్ని పొందుతారు. విద్యార్థులు కూడా సక్సెస్‌ను పొందుతారు. కెరీర్‌లో కూడా కలిసి వస్తుంది. భాగస్వామి నుంచి శుభవార్త వింటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

News/Rasi Phalalu/గురువు-చంద్రుని కలయికతో గజకేసరి రాజయోగం, ఈ మూడు రాశులకు బోలెడు లాభాలు.. ఇల్లు, వాహనాలు, విజయాలు, వాహనాలు ఇలా ఎన్నో!
News/Rasi Phalalu/గురువు-చంద్రుని కలయికతో గజకేసరి రాజయోగం, ఈ మూడు రాశులకు బోలెడు లాభాలు.. ఇల్లు, వాహనాలు, విజయాలు, వాహనాలు ఇలా ఎన్నో!