గురువు, శని యోగంతో ఈ 3 రాశులకు గోల్డెన్ టైం.. ధనం, ఉద్యోగాలు ఇలా అనేక లాభాలు!
గురువు జూలై 7న ఉదయిస్తాడు. జూలై 13న శని తిరోగమనంలోకి వెళ్తాడు. ఈ స్థితిలో ఉండడం వలన ప్రజల జీవితాల్లో ముఖ్యమైన మార్పులు వస్తాయి. గురువు, శని రెండూ శక్తివంతమైన గ్రహాలు. ఈ ఇద్దరూ ప్రత్యేక యోగాన్ని ఏర్పరుస్తారు. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టం తీసుకు వస్తుంది. కొత్త విజయాలు ఉంటాయి.
జూలై నెలలో కొన్ని గ్రహాలు రాశి మార్పు చెందుతాయి. గురువు జూలై 7న ఉదయిస్తాడు. ఈ సమయంలో అనేక రాశుల వారిపై ఆశీర్వాదాలను కురిపిస్తాడు. జూలై 13న శనితిరోగమనంలోకి వెళ్తాడు. ఈ స్థితిలో ఉండడం వలన ప్రజల జీవితాల్లో ముఖ్యమైన మార్పులు వస్తాయి. గురువు, శని రెండూ శక్తివంతమైన గ్రహాలు. ఈ ఇద్దరూ ప్రత్యేక యోగాన్ని ఏర్పరుస్తారు. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టం తీసుకు వస్తుంది.
గురువు, శని ఈ మూడు రాశుల వారికి అనేక లాభాలను ఇస్తారు (freepik)
ప్రమోషన్లు, ఆకస్మిక ధనలాభాలు ఇలా ఎన్నో లాభాలు ఉంటాయి. పెద్ద బాధ్యతలు పూర్తి చేస్తారు. కార్యాలయంలో కొత్త విజయాలు ఉంటాయి. ఈ నెలలో మరి ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది, ఏ రాశుల వారు ఎలాంటి లాభాలు పొందుతారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గురువు, శని ఈ మూడు రాశుల వారికి అనేక లాభాలను ఇస్తారు
1.వృషభ రాశి:
వృషభరాశి వారికి జూలై నెల కలిసి వస్తుంది. ఈ నెలలో వృషభ రాశి వారు ఆర్థిక పరంగా సంతోషంగా ఉంటారు. గురువు ఉదయంతో డబ్బు వస్తుంది. శని తిరోగమనంతో ఆదాయం పెరుగుతుంది.
ఇలా విపరీతంగా డబ్బు చేతికి వస్తుంది. పాత ఇన్వెస్ట్మెంట్లు అనుకోకుండా ఎక్కువ లాభాలను తీసుకు వస్తాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి కూడా ఇది మంచి సమయం. ఆర్థిక పరంగా కూడా బావుంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు.
2.మిథున రాశి:
మిథునరాశి వారికి జూలై నెల బాగుంటుంది. ఈ రాశి వారు ఈ నెలలో సక్సెస్‌ను అందుకుంటారు. పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు వస్తాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం మారాలని అనుకునే వారికి కూడా ఇదే మంచి సమయం.
3.కర్కాటక రాశి:
కర్కాటకరాశి వారికి జూలై నెల బాగుంటుంది. శని తిరోగమన, గురువు ఉదయంతో ఈ రాశి వారికి కలిసి వస్తుంది. అదృష్టం ఉంటుంది. కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది మంచి సమయం. అభివృద్ధిని చూడొచ్చు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బాధ్యతగా ఉంటారు. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. జీవితంలో సమతుల్యం ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
News/Rasi Phalalu/గురువు, శని యోగంతో ఈ 3 రాశులకు గోల్డెన్ టైం.. ధనం, ఉద్యోగాలు ఇలా అనేక లాభాలు!
News/Rasi Phalalu/గురువు, శని యోగంతో ఈ 3 రాశులకు గోల్డెన్ టైం.. ధనం, ఉద్యోగాలు ఇలా అనేక లాభాలు!