గురువు రాశి మార్పుతో ఈ రాశులకు అనేక లాభాలు.. త్వరలో ధనలాభం, ఉద్యోగాలు ఇలా ఎన్నో!
గురువు వేగంగా కదులుతాడు. గురువు రాశి మార్పు చెందడంతో చాలా రాశుల వారికి కలిసిరాబోతోంది. కర్కాటక రాశిలో గురువు సంచారం ఏ రాశిపై కూడా ప్రభావం చూపుతుందా? మీకు కూడా శుభఫలితాలు ఎదురవుతాయా? కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. గురువు–చంద్రుడు స్నేహితులు. గురువు రాశి మార్పుతో ఏ రాశుల వారికి మంచి జరుగుతుంది?
గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలా జరిగినప్పుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. కొన్నిసార్లు ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. అక్టోబర్ నెలలో అతిపెద్ద రాశి మార్పు చోటు చేసుకోనుంది. దేవతల గురువు, దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశించడంతో అనేక శుభయోగాలు ఏర్పడతాయి.

గురువువేగంగా కదులుతాడు. గురువు రాశి మార్పు చెందడంతో చాలా రాశుల వారికి కలిసిరాబోతోంది. కర్కాటక రాశిలో గురువు సంచారం ఏ రాశిపై కూడా ప్రభావం చూపుతుందా? మీకు కూడా శుభఫలితాలు ఎదురవుతాయా? మరి, ఇప్పుడే తెలుసుకోండి.
కర్కాటకరాశికి అధిపతి చంద్రుడు. గురువు చంద్రుని రాశిలో ఉన్నప్పుడు శుభఫలితాలు ఎదురవుతాయి. గురువు–చంద్రుడు స్నేహితులు. గురువు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు ఏ రాశుల వారికి మంచి జరుగుతుంది?
గురువు రాశి మార్పుతో ఈ రాశులకు అనేక లాభాలు
1.కర్కాటక రాశి:
కర్కాటక రాశిలో గురువు ప్రవేశించడంతో ఈ రాశి వారికి మంచి జరగనుంది. ఈ సమయంలో ఈ రాశివారు కొత్త అవకాశాలను పొందుతారు. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది.
2.వృశ్చిక రాశి:
వృశ్చికరాశి వారికి గురువు సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కెరీర్‌లో పురోగతిని పొందుతారు. వ్యాపార పరంగా కూడా కలిసివస్తుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. పిల్లలు ఉన్నవారికి సంతోషం కలుగుతుంది.
3.తుల రాశి:
తుల రాశి వారికి గురువు సంచారంలో మార్పు మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కొత్త ఉద్యోగాలను పొందుతారు. పదోన్నతి లభించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగంతో పాటుగా వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం. పాత పెట్టుబడులు కూడా ఎక్కువ లాభాలను తీసుకువస్తాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



