2025లోనే శక్తివంతమైన అమావాస్య.. బుధవారం+చంద్ర గురువుల సంయోగం+మృగశిర నక్షత్రం.. ఇలా చేస్తే సమస్యే ఉండదు!
2025లో వచ్చే అమావాస్యలలో ఈ అమావాస్య చాలా స్పెషల్. ఎందుకంటే జూన్ 26 నుంచి వెంటనే గుప్త నవరాత్రులు మొదలవుతాయి. పైగా అమావాస్య నాడు చంద్రుడు, గురువు సంయోగం చెంది మిధున రాశిలో సంచరిస్తారు. పైగా మృగశిర నక్షత్రం చాలా ప్రత్యేకమైనది. ఈ విశేషమైన అమావాస్య నాడు ఏం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది?
అమావాస్య గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హిందూ ధర్మంలో అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. 2025లో వచ్చే అమావాస్యలలో ఈ అమావాస్యచాలా స్పెషల్‌గా చెప్పవచ్చు. ఎందుకంటే జూన్ 26 నుంచి వెంటనే గుప్త నవరాత్రులు మొదలవుతాయి. పైగా అమావాస్యనాడు చంద్రుడు, గురువు సంయోగం చెంది మిధున రాశిలో సంచరిస్తారు. పైగా మృగశిర నక్షత్రం చాలా ప్రత్యేకమైనది.

మృగశిరనక్షత్రం నాడు ఏదైనా మొదలు పెడితే ఖచ్చితంగా అది పూర్తవుతుంది. కొత్త పనులు మొదలుపెట్టడానికి మృగశిర నక్షత్రం చాలా మంచిది. అంతేకాకుండా వెంటనే ఆరుద్ర నక్షత్రం కూడా వస్తుంది. ఇది రాహువు నక్షత్రం. ఏదైనా అనుకున్న వాటిని పూర్తవడానికి ఇది మంచిది. మన కోరికలను త్వరగా నెరవేర్చుకోవడానికి ఈ రోజు చాలా ఉత్తమమైనది.
అమావాస్య తేదీ, సమయం:
జ్యేష్ఠఅమావాస్య తిథి – జూన్ 24 సాయంత్రం 7:00 గంటలకు మొదలవుతుంది.
ముగింపు – జూన్ 25 సాయంత్రం 4:02 గంటలకు.
ఉదయ తిథి ప్రకారం అమావాస్యను చూసుకోవాలి కనుక జూన్ 25న అమావాస్యను జరుపుకోవాలి.
అమావాస్య విశిష్టత:
పితృదేవతలను ఈరోజు ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది. అమావాస్య నాడు పితృదేవతలకు పిండప్రదానం చేయడం, తర్పణాలు వదలడం వలన పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. వారి ఆశీస్సులు పొందవచ్చు. అమావాస్యనాడు చంద్రుని ప్రభావం తక్కువగా ఉంటుంది. కనుక కొందరిలో మానసిక శాంతి లేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. వారు ఈరోజున పూజలు చేయడం వలన సమస్యలు తొలగిపోతాయి.
ఈ విశేషమైన అమావాస్యనాడు ఏం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది?
ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ శక్తివంతమైన అమావాస్య నాడు ఏం చేయాలో తెలుసుకుందాం:
1.ఆర్థిక ఇబ్బందులు
ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఈరోజు లక్ష్మీదేవినిఆరాధించాలి. ఇది శుభ ఫలితాలను పొందవచ్చు. ధనం కలిగి సంతోషంగా ఉండచ్చు.
2.అనారోగ్య సమస్యలు
కోర్టు కేసులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాలి. ఇలా చేస్తే మీ సమస్యలు తగ్గుతాయి.
3.సంతాన సమస్యలు
సంతాన భాగ్యం కోసం సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఆరాధించాలి. అలా చేస్తే సంతానం కలిగి సంతోషంగా ఉండచ్చు.
4.మానసిక అశాంతి
మానసిక అశాంతి ఉంటే మానసిక శాంతి కోసం శివుడిని ఆరాధించాలి. ఇలా చేస్తే మీ సమస్యలు తగ్గుతాయి. సంతోషంగా ఉండచ్చు.
5.వైవాహిక సమస్యలు
వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోవాలంటే శ్రీకృష్ణుడినిఆరాధించాలి. ఇలా చేస్తే మీ బంధం మధురంగా మారుతుంది.
6.ఉద్యోగ సమస్యలు
ఉద్యోగ సమస్యలు తీరాలన్న, ప్రమోషన్ రావాలన్నా హనుమంతుడిని ఆరాధించాలి.
అమావాస్యనాడు ఈ పనులు మాత్రం చేయకండి:
- అమావాస్యనాడు కొన్ని పనులు చేయడం మంచిది కాదు. అమావాస్యనాడు గృహప్రవేశం, శుభకార్యాలు జరపడం వంటివి చేయకూడదు.
- ఏదైనా కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకున్న ఈ రోజు మంచిది కాదు.
- ఈరోజు ద్వేషం, ప్రతికూలఆలోచనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
- మద్యపానం, మాంసం సేవించడం లాంటివి మానుకోవాలి. అమావాస్యనాడు సాత్విక ఆహారం తింటే మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



