కార్తీక మాసంలో పరమ శివుడిని ప్రత్యేక ఆరాధిస్తారు. 30 రోజుల పాటు శివుడిని నియమ నిష్టలతో పూజిస్తారు. కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఉంటారు. అలాగే ఏకాదశి, పౌర్ణమి రోజు కూడా శివుడిని ప్రత్యేకించి పూజిస్తారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం కార్తీకమాసం అక్టోబర్ 22న మొదలవుతుంది నవంబర్ 20 దాకా కార్తిక మాసం ఉంటుంది.

ఈ నెల రోజుల పాటు పరమేశ్వరుడిని మనసారా ఆరాధిస్తారు. శివాలయాలు అన్నీ కూడా శివనామస్మరణతో మారుమ్రోగిపోతాయి. ఈ కార్తీకమాసంలో శివుడితో పాటుగా విష్ణుమూర్తి లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తారు. కార్తీక స్నానాలు ఆచరించినా, దీపారాధన చేసినా, భక్తి శ్రద్దలతో శివుడుని, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధించిన విశేష ఫలితాలు కలుగుతాయి. చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం.
కార్తీకమాసంలో దీపారాధన
కార్తీక మాసంలో చాలా ముఖ్యమైనది దీపారాధన. కొందరు పౌర్ణమి రోజున మాత్రమే దీపారాధన చేస్తారు. మరి కొంత మంది నెల్లాళ్లు కూడా దీపారాధన చేస్తారు. తులసి కోట దగ్గర, దేవాలయాల్లో, ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే చాలా మంచిదని భావిస్తారు.
కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సుఖసంతోషాలు కలుగుతాయట. కార్తీకమాసంలో సూర్యోదయం కంటే ముందే నది స్నానం చేసే దీపారాధన చేస్తే సకల పాపాలు తొలగిపోయి, సంతోషంగా ఉండొచ్చని, పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.
కార్తీక మాసం విశిష్టత
కార్తీక మాసంలో భగవంతుడిని పూజిస్తే మానసిక ప్రశాంతతని పొందవచ్చు. శివుడుని ఆరాధిస్తే పాప విమోచనమని నమ్మకం. దీపారాధన ద్వారా మన లోకంలోనే కాకుండా పితృలోకానికి కూడా పవిత్రత వస్తుందని అంటారు. పవిత్ర నతల్లో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే ఈ మాసంలో దీపారాధన ద్వారా వ్రతాలు చేస్తే పాప విముక్తిని పొందవచ్చు. ఉదయం నదుల్లో స్నానం చేసి దేవాలయాల్లో శివుడిని విష్ణువుని పూజిస్తే కుటుంబ శ్రేయస్సు, సంపద కలుగుతాయని అంటారు. కార్తీకమాసంని పుణ్యకాలంగా భావిస్తారు. కార్తీక మాసంలో దానాలు చేస్తే కూడా విశేష ఫలితాలని పొందవచ్చు.
కార్తీక మాసంలో దానం
కార్తీకమాసంలో అన్నదానం, దీప దానం, వస్త్ర దానం వంటివి చేస్తే పుణ్యఫలితం కలుగుతుంది. గోదానం చేస్తే కూడా మంచి జరుగుతుంది. బ్రాహ్మణులకు దానం చేస్తే విశేష పుణ్యాన్ని పొందవచ్చు.
కార్తీక సోమవారం
{{/usCountry}}కార్తీకమాసంలో అన్నదానం, దీప దానం, వస్త్ర దానం వంటివి చేస్తే పుణ్యఫలితం కలుగుతుంది. గోదానం చేస్తే కూడా మంచి జరుగుతుంది. బ్రాహ్మణులకు దానం చేస్తే విశేష పుణ్యాన్ని పొందవచ్చు.
కార్తీక సోమవారం
{{/usCountry}}కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది. శివుడికి ఇష్టమైన ఈ వ్రతం చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది. కార్తీక సోమవారాల్లో శివలింగానికి అభిషేకాలు చేసినా, బిల్వపత్రాలను సమర్పించినా విశేష ఫలితాలను పొందడానికి అవుతుంది.
తులసి పూజ ప్రాధాన్యత
కార్తీక మాసంలో సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది. ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఆర్థిక సౌభాగ్యాన్ని పొందవచ్చు ప్రతికూల శక్తి తొలగిపోతుంది.