కార్తీకమాసంలో శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. శివుడిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ పవిత్రమైన మాసంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలను కూడా చేస్తారు. కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉంటారు. అలాగే ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి ఈనాడు కూడా శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. శక్తి సామర్థ్యాల మేరకు శివునికి జలాభిషేకం, పాలు, పెరుగు, తేనే, నెయ్యితో అభిషేకం కూడా చేస్తారు.

ఇది ఇలా ఉంటే, ఈ కార్తీక మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను చదువుకుంటే మంచి జరుగుతుంది. మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను చదివి శివుడిని పూజించడం వలన శివుని అనుగ్రహంతో సకల సంతోషాలను పొందవచ్చు, ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మరి ఏ రాశి వారు ఏ మంత్రాన్ని జపిస్తే బాగా కలిసి వస్తుందో ఇప్పుడే తెలుసుకుందాం.
కార్తీక మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు ఏ రాశి వారు ఏ మంత్రాలను జపించాలి?
మేష రాశి:
మేష రాశి వారు కార్తీకమాసంలో “ఓం మహాకాలాయ నమః”, “ఓం నమః శివాయ” అనే మంత్రాలను జపిస్తే బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా సోమవారం నాడు ఈ మంత్రాలను జపించేలా చూడండి. దీంతో శివయ్య అనుగ్రహం కలుగుతుంది.
వృషభ రాశి:
వృషభ రాశి వారు శివుని అనుగ్రహాన్ని పొందడానికి “ఓం విశ్వనాథాయ నమః”, “ఓం నాగేశ్వరాయ నమః” అనే మంత్రాలను జపించండి. దీంతో శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు, కష్టాలన్నీ తొలగిపోతాయి.
మిథున రాశి:
మిథున రాశి వారు ఈ కార్తీకమాసంలో చంద్రుడుని ప్రసన్నం చేసుకోవాలంటే “ఓం విస్తారాయ నమః” మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వలన సులభంగా కార్తీకమాసంలో చంద్రుని ప్రసన్నం చేసుకోవచ్చు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు కార్తీకమాసంలో “ఓం చంద్రమౌళీశ్వరాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే, శివయ్య అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
సింహ రాశి:
{{/usCountry}}కర్కాటక రాశి వారు కార్తీకమాసంలో “ఓం చంద్రమౌళీశ్వరాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే, శివయ్య అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
సింహ రాశి:
{{/usCountry}}ఈ రాశి వారు “ఓం రుద్రనాథాయ నమః” అనే మంత్రాన్ని కార్తీకమాసంలో జపిస్తే మంచిదే. ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు జపించేలా చూసుకోండి.
కన్యా రాశి:
కన్యా రాశి వారు “ఓం త్రిపురారాయ నమః” మంత్రాన్ని పాటించాలి. ఈ మంత్రాన్ని పఠించడం వలన శివుని అనుగ్రహంతో అన్నింట్లో విజయాలు కలుగుతాయి.
తులా రాశి:
తులా రాశి వారు “ఓం దిననాథాయ నమః”, “ఓం నందీశ్వరాయ నమః” అనే మంత్రాలను జపిస్తే బాగా కలిసి వస్తుంది. శివుని అనుగ్రహంతో ఎల్లవేళలా సంతోషం ఉంటుంది.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారు కార్తీకమాసంలో “ఓం మహేశ్వరాయ నమః” అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని జపించడం వలన శివయ్య అనుగ్రహంతో ఇబ్బందులు తొలగిపోతాయి.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారు “ఓం దేవదీశ్వరాయ నమః”, “ఓం నమః శివాయ” మంత్రాలను జపించాలి. ఈ మంత్రాలను జపిస్తే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.
మకర రాశి:
మకర రాశి వారు కార్తీకమాసంలో “ఓం శివదానీశ్వరాయ నమః” అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని పఠిస్తే శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
కుంభ రాశి:
కుంభ రాశి వారు కార్తీకమాసంలో “ఓం పాతాళేశ్వరాయ నమః” అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వలన మానసిక ఒత్తిడి కూడా తొలగిపోతుంది.
మీన రాశి:
మీన రాశి వారు “ఓం మహాదేవాయ నమః” అనే మంత్రాన్ని పఠించాలి. దీంతో శివుని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు.