కార్తీక పౌర్ణమి నాడు అరుదైన యోగం.. ఆ రోజు ఈ ఒక్క పరిహారాన్ని పాటిస్తే అదృష్టమే మారిపోతుంది!

ఈసారి నవంబర్ 5, బుధవారం నాడు వచ్చింది. పౌర్ణమి తిథి నవంబర్ 4 రాత్రి 10:36కి ప్రారంభమవుతుంది, నవంబర్ 5 రాత్రి 8:24తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం చూసుకోవాలి కాబట్టి నవంబర్ 5న కార్తీక పౌర్ణమిని జరుపుకోవాలి. చాలా ఏళ్ల తర్వాత ఈ కార్తీక పౌర్ణమి చాలా అదృష్టకరమని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.

Published on: Oct 23, 2025, 12:00:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పౌర్ణమి చాలా విశేషమైనది. ప్రతి నెలా వచ్చే పౌర్ణమి రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇది చాలా మంచి రోజుగా భావిస్తారు. పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి కథ కూడా వింటారు. అలాగే దానాలు చేస్తే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కూడా చాలా విశేషమైనది. కార్తీక మాసంలో పరమశివుడిని ఆరాధిస్తారు. అలాగే లక్ష్మిని, విష్ణుమూర్తిని కూడా పూజిస్తారు.

కార్తీక పౌర్ణమి నాడు యాదృచ్ఛికం (pinterest)
కార్తీక పౌర్ణమి నాడు యాదృచ్ఛికం (pinterest)

ఈ సంవత్సరం కార్తీక మాసం ఎప్పుడు వచ్చింది?

పంచాంగం ప్రకారం చూసినట్లయితే, కార్తీక పౌర్ణమి ఈసారి నవంబర్ 5, బుధవారం నాడు వచ్చింది. పౌర్ణమి తిథి నవంబర్ 4 రాత్రి 10:36కి ప్రారంభమవుతుంది, నవంబర్ 5 రాత్రి 8:24తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం చూసుకోవాలి కాబట్టి నవంబర్ 5న కార్తీక పౌర్ణమిని జరుపుకోవాలి. ఆ రోజున పవిత్ర నదిలో స్నానం చేసి దానం చేయడం వలన మంచి ఫలితం కనపడుతుంది. అలాగే విష్ణుమూర్తిని పూజిస్తే కూడా అనేక విధాలుగా కలిసి వస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు మంచి పనులు చేస్తే విశేష ఫలితాలను పొందవచ్చు.

కార్తీక పౌర్ణమి నాడు యాదృచ్ఛికం

చాలా ఏళ్ల తర్వాత ఈ కార్తీక పౌర్ణమి చాలా అదృష్టకరమని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు వందల ఏళ్ల తర్వాత అదృష్ట యోగం జరగబోతోంది. ఆ రోజున సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, భరణి నక్షత్రం, అశ్వినీ నక్షత్రం ఉండటం విశేషం. ఆ రోజున చాలా మంచి రోజు. కనుక పూజ, దానాలు, ఉపవాసం వంటివి ఆచరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

కార్తీక పౌర్ణమి విశిష్టత:

శివుడు రాక్షసుడైన త్రిపురాసురుడిని కార్తీక పౌర్ణమి వేళ సంహరించాడని అంటారు. అందుకని కార్తీక పౌర్ణమిని “త్రిపుర పూర్ణిమ” లేదా “త్రిపురారి పూర్ణిమ” అని కూడా అంటారు. ఆ రోజున విష్ణువు, శివుని ఆశీస్సులు కలిగి సంతోషంగా ఉండాలంటే కచ్చితంగా ఆరాధించాలి.

కార్తీకమాసంలో ఈ పొరపాట్లు చేయకండి

  1. కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదు.
  2. కార్తీక మాసంలో మద్యం, మాంసం వంటివి ముట్టుకోకూడదు.
  3. దైవ దూషణ చేయడం, పాపపు ఆలోచనలను కలిగి ఉండడం మంచిది కాదు.
  4. ఈ నెల ఎవరికి ద్రోహం చేయకుండా చూసుకోవాలి.
  5. అలాగే మినుములు తినకూడదు.
  6. కార్తీకమాసం వ్రతం పాటించేవారు, ఆ వ్రతం చేయని వారి వంట తినకూడదు.
  7. నలుగు పెట్టుకుని స్నానం చేయడం కూడా మంచిది కాదు.
  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More