వాస్తు ప్రకారం క్రాసులా మొక్క ఏ దిశలో ఉండాలి? ఇలా చేస్తే సంపద రెట్టింపు అవుతుంది!

ఇంట్లో క్రాసులా మొక్క ఉన్నట్లయితే మంచి జరుగుతుంది. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది, సంపద పెరుగుతుంది, కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. క్రాసులా మొక్క సరైన దిశలో ఉన్నట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుపడతాయి, ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. ఇంట్లో ఈ మొక్కను పెట్టడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి.

Published on: Jul 8, 2025, 13:30:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సంతోషంగా ఉండొచ్చు, ఎలాంటి బాధలు ఉన్నా సరే తొలగిపోతాయి. చాలామంది ఇంట్లో మొక్కలను పెంచుతూ ఉంటారు. వాస్తుప్రకారం ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుంది, ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా పొందవచ్చు. మరి వాస్తు ప్రకారం క్రాసులా మొక్క విషయంలో ఎటువంటి నియమాలను పాటించాలి, క్రాసులా మొక్కను ఇంట్లో ఉంచేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో వాస్తు ప్రకారం క్రాసులా మొక్క ఏ దిశలో ఉండాలి? (pinterest)
ఇంట్లో వాస్తు ప్రకారం క్రాసులా మొక్క ఏ దిశలో ఉండాలి? (pinterest)

కుబేరుని అనుగ్రహం

ఇంట్లో క్రాసులా మొక్క ఉన్నట్లయితే మంచి జరుగుతుంది. ఆర్థికపరంగా కలిసి వస్తుంది, సంపద పెరుగుతుంది, కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. ఇక వాస్తు ప్రకారం క్రాసులా మొక్క ఏ దిశలో ఉండాలనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో వాస్తు ప్రకారం క్రాసులా మొక్క ఏ దిశలో ఉండాలి?

వాస్తు ప్రకారం క్రాసులా మొక్క ఉండాలి. లేదంటే ప్రతికూల శక్తి కలిగి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రాసులా మొక్క సరైన దిశలో ఉన్నట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుపడతాయి, ప్రతికూలశక్తి కూడా తొలగిపోతుంది. ఇంట్లో ఈ మొక్కను పెట్టడం వలన వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.

ఏ దిశలో ఉండాలి?

వాస్తు ప్రకారం ఇంట్లో ఉత్తరం వైపుకు రాశుల మొక్క ఉంటే మంచిది, లేదంటే ఈశాన్యం వైపు కూడా ఉండొచ్చు. ఈ దిశలో ఉండడం వలన కూడా కలిసి వస్తుంది.

ఇలాంటి మొక్కను ఇంట్లో పెట్టడం మంచిది కాదు:

వాస్తు ప్రకారం క్రాసులా మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండిపోయినది లేదా ఆకులు కుళ్లిపోవడం మంచిది కాదు. ఎప్పుడు కూడా క్రాసులా మొక్క తాజాగా ఉండేటట్టు చూసుకోవాలి. కానీ సరైన మొక్క ఇంట్లోలేకపోతే మాత్రం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది, ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వాస్తు ప్రకారం క్రాసులా మొక్క విషయంలో చేయకూడని పొరపాట్లు:

  • ఇంట్లో పెట్టేటప్పుడు ఇంటి ముఖద్వారానికి కుడి వైపు పెట్టడం వలన మంచి జరుగుతుంది. అలా చేస్తే కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంటారు.
  • క్రాసులా మొక్కను పెట్టేటప్పుడు సూర్యకిరణాలు దానిపై పడేటట్టు చూసుకోవాలి.
  • వాస్తు ప్రకారం క్రాసులా మొక్కను డ్రాయింగ్ రూమ్‌లో లేదా బాల్కనీలో పెడితే కూడా మంచి జరుగుతుంది.
  • క్రాసులా మొక్కను బాత్రూంలో, వంటగదిలో పెట్టడం మంచిది కాదు.
  • క్రాసులా మొక్క వలన సంతోషంకలిగి సక్సెస్‌ను అందుకోవాలంటే కనీసం వారానికి రెండు మూడు సార్లు నీళ్లు పోయండి, అలాగే కుండిని కూడా శుభ్రంగా ఉంచండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More