న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందో తెలుసుకోవడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా అంచనా వేయవచ్చు. 2025 ఇక త్వరలోనే ముగియబోతోంది, 2026 రాబోతోంది. 2026 రాడిక్స్ సంఖ్యల వారికి బాగుంటుంది. పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ సంఖ్యను కనుగొనవచ్చు. మరి మీ రాడిక్స్ సంఖ్య ఆధారంగా 2026 మీకు ఎలా ఉంటుందో తెలుసుకోండి.
పుట్టిన తేదీ ఆధారంగా 2026 ఎలా ఉంటుందో తెలుసుకోండి
రాడిక్స్ నెంబర్ 1:

ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే రాడిక్స్ నెంబర్ 1 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి 2026లో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కష్టాలు తొలగిపోతాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు చేయకుండా చూసుకోండి.
రాడిక్స్ నెంబర్ 2:
ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 2 అవుతుంది. 2026లో అప్పుడప్పుడు మూడ్ స్వింగ్స్, కన్ఫ్యూజన్ వంటివి ఎదురవుతాయి. ప్రేమ జీవితం దృఢంగా మారుతుంది. క్రియేటివిటీ పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఎక్కువ ఆదాయం వస్తుంది. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది.
రాడిక్స్ నెంబర్ 3:
ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 3 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు 2026లో కొత్త కెరీర్ అవకాశాలను పొందుతారు. లీడర్షిప్ స్కిల్స్ పెరుగుతాయి, ఆదాయం కూడా పెరగవచ్చు. పై చదువులకు బాగా కలిసి వస్తుంది. ప్రేమ జీవితం కూడా ఆనందంగా సాగుతుంది.
రాడిక్స్ నెంబర్ 4:
ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినట్లయితే రాడిక్స్ నెంబర్ 4 అవుతుంది. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. జీవిత భాగస్వామిని బాధపెట్టే మాటలు అనడం లాంటివి చేయకుండా చూసుకోండి.
రాడిక్స్ నెంబర్ 5:
{{/usCountry}}ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినట్లయితే రాడిక్స్ నెంబర్ 4 అవుతుంది. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. జీవిత భాగస్వామిని బాధపెట్టే మాటలు అనడం లాంటివి చేయకుండా చూసుకోండి.
రాడిక్స్ నెంబర్ 5:
{{/usCountry}}ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే రాడిక్స్ నెంబర్ 5 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగంలో మార్పు ఉండొచ్చు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభసమయం. 2026లో మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. కమ్యూనికేషన్‌ను మెయింటైన్ చేయండి, ఆరోగ్యకరమైన డైట్‌ను తీసుకోండి.
రాడిక్స్ నెంబర్ 6:
ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 6 అవుతుంది. కొత్త సంవత్సరం ఈ తేదీల్లో పుట్టిన వారికి బాగా కలిసి వస్తుంది. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. సంతోషంగా ఉంటారు, బాధ్యతలు కూడా పెరుగుతాయి. కెరీర్‌లో ఊహించని మార్పులు వస్తాయి. మీడియా, బ్యూటీ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది.
రాడిక్స్ నెంబర్ 7:
ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 7 అవుతుంది. విజయాలను అందుకుంటారు. రిలేషన్షిప్ బాగుంటుంది. ఉద్యోగస్తులకు కూడా ఇది శుభసమయం. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. పాజిటివ్‌గా ఉండాలి.
రాడిక్స్ నెంబర్ 8:
ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే రాడిక్స్ నెంబర్ 8 అవుతుంది. కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. 2026లో కొంచెం సహనాన్ని అలవాటు చేసుకోండి. విజయాలను అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో మొండిగా ఉండకండి.
రాడిక్స్ నెంబర్ 9:
ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టినట్లయితే రాడిక్స్ నెంబర్ 9 అవుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒంటరిగా ఉంటున్న వారు భాగస్వామిని పొందే అవకాశం ఉంది. ఒత్తిడి ఎక్కువ అవ్వకుండా చూసుకోండి.