సంపదకు దేవత లక్ష్మీదేవి వీళ్ళపై ఖచ్చితంగా దయ చూపుతుంది, ఖచ్చితంగా ధనవంతులను చేస్తుంది!

ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే లక్ష్మీ అనుగ్రహం ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సిరి సంపదలకు లోటు ఉండదు. చాలా మంది కష్టపడి పని చేస్తూ ఉంటారు. కానీ డబ్బులు నిలవక సతమతమవుతూ ఉంటారు. అయితే, డబ్బులు లేకపోవడానికి వారి దగ్గర చాలా కారణాలు ఉంటాయి. కొన్ని రాశుల వారికి మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.

Published on: Oct 10, 2025, 10:00:19 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఒక్కరూ ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలని అనుకుంటారు. ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది బాధ పడుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సిరి సంపదలకు లోటు ఉండదు. చాలా మంది కష్టపడి పని చేస్తూ ఉంటారు.

ఏ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది? (pinterest)
ఏ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది? (pinterest)

కానీ డబ్బులు నిలవక సతమతమవుతూ ఉంటారు. అయితే, డబ్బులు లేకపోవడానికి వారి దగ్గర చాలా కారణాలు ఉంటాయి. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశుల వారు లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకి లోటే లేకుండా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. డబ్బులు త్వరగా ఖర్చు అయిపోవడం వంటి సమస్యలు ఈ రాశుల వారికి రావు.

ఏ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది?

వృషభ రాశి, కర్కాటక రాశి, సింహ రాశి, తులా రాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. సిరి సంపదలకు లోటు ఉండదు. ఈ రాశుల వారు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోరు. ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడంతో ఎప్పుడూ సంతోషంగా డబ్బుతో ఉంటారు.

ఇలాంటి ఇళ్లల్లో డబ్బుకు లోటు ఉండదు

లక్ష్మీదేవి ఎప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, సానుకూల ఆలోచనలను కలిగి ఉండడం, కష్టపడి పని చేయడం వంటివి ఫాలో అయ్యే వారి ఇంటే ఉంటుంది. అలాంటి వారికి విజయాలు కొంచెం ఆలస్యంగా వచ్చినా ఎప్పటికీ వారితోనే సంతోషం ఉండేలా చూస్తుంది. పేరు, ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆర్థికపరంగా కూడా సమస్యలు రావు.

అలాగే ఎవరైతే అందరూ సంతోషంగా, ప్రేమగా ఉండి, గొడవలు లేకుండా ఉంటారో, ఆయా ఇళ్లలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఖచ్చితంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి పైన చెప్పిన విధంగా ఉన్నవారి దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతుంది. అలాంటి వారికి డబ్బు కొరత రాదు.

దాన ధర్మాలు:

లక్ష్మీ దేవికి ఎవరికైనా సహాయం చేయడం అంటే కూడా ఇష్టం. ఎవరైతే వారి సంపాదనలో కొంత మొత్తాన్ని దానాలకు వెచ్చిస్తారో, వారి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండడానికి ఇష్ట పడుతుంది. అలాంటి వారి దగ్గర కూడా ఆర్థిక ఇబ్బందులు రావు. ఎప్పుడూ డబ్బు ఎక్కువ అవుతుంది, తరిగిపోదు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More