హనుమంతుడికి ఈ 3 రాశులు అంటే మహా ప్రీతి.. ఎల్లప్పుడూ ఏ బాధలు లేకుండా సంతోషంగా ఉంటారు!
ఈ రాశుల వారికి హనుమంతుని ప్రత్యేక ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం ఈ మూడు రాశులు వారు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టం. ఈ రాశుల వారిని హనుమంతుడు ఎప్పుడూ ఆదుకుంటాడు. ఈ రాశుల వారి జీవితంలో ఏ భయం, బాధలు లేకుండా ఉండేటట్లు చూస్తాడు.
మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి. రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటుందో అనేది చెప్పడం తో పాటు, భవిష్యత్తు గురించి కూడా చెప్పొచ్చు.

ఈ రాశుల వారు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టం. ఏ రాశుల వారిని హనుమంతుడుఎల్లప్పుడూ శుభ ఫలితాలను ఇచ్చి చూసుకుంటాడు? హనుమంతుడు అనుగ్రహంతో సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారో తెలుసుకుందాం. మంగళవారం నాడు హనుమంతుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. హనుమంతుడిని మంగళవారం నాడు పూజిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. హనుమంతుడికి ఇష్టమైన రాశుల గురించి తెలుసుకుందాం.
ఈ రాశుల వారికి హనుమంతుని ప్రత్యేకఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం ఈ మూడు రాశులు వారు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టం. ఈ రాశుల వారిని హనుమంతుడు ఎప్పుడూ ఆదుకుంటాడు. ఈ రాశుల వారి జీవితంలో ఏ భయం, బాధలు లేకుండా ఉండేటట్లు చూస్తాడు. మరి హనుమంతుడికి ఇష్టమైన ఆ రాశులు ఏవి? వారిలో మీరు ఉన్నారా చూసుకోండి.
హనుమంతుడికి ఈ 3 రాశులు అంటే మహా ప్రీతి:
1.మేష రాశి:
మేష రాశి వారికి హనుమంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మేష రాశి వారిని హనుమంతుడు ఎప్పుడూ కూడా ఆదుకుంటాడు. మేష రాశి అధిపతి కుజుడు. కుజుడు దేవుడు హనుమంతుడు. ఈ రాశి వారు ఎప్పుడూ ధైర్యంగా ఉంటారు. హనుమంతుని ప్రత్యేక ఆశీస్సులతో సంతోషంగా ఉంటారు.
2.సింహ రాశి:
సింహరాశికి అధిపతి సూర్యుడు.సింహ రాశి వారు చాలా తెలివైన వారు. సింహ రాశి వారు పుట్టుకతోనే గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ రాశి వారు హనుమంతుని ప్రత్యేక ఆశీస్సులను పొందుతారు. విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు.
3.వృశ్చిక రాశి:
వృశ్చికరాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారు ఎంతో కష్టపడి పని చేస్తారు. అనుకున్న వాటిని పూర్తి చేస్తారు. అన్ని న్యాయంగా జరగాలని భావిస్తారు. హనుమంతుని ప్రత్యేక ఆశీస్సులతో ఏ భయం లేకుండా ఉంటారు. సమస్యలు కూడా రావు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



