అదృష్ట రాశులు: ఆగష్టు 1 నుండి ఈ మూడు రాశుల వారి కెరీర్‌లో మార్పులు, కొత్త అవకాశాలు!
శుక్రుడు విలాసాలు, డబ్బు, కళ, ప్రేమ వంటి వాటికి కారకుడు. ప్రతి 23 రోజులకు ఒకసారి శుక్రుడు తన రాశిని మారుస్తూ ఉంటాడు. ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఆగస్టు 1న ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రంలో శుక్రుని సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది.
గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. అదే విధంగా నక్షత్రాలను కూడా మార్చుతూ ఉంటాయి. ఆగస్టు1 అంటే ఈరోజు, కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. నిజానికి అదృష్టం అంటే ఈ రాశులదే.

శుక్రుడి సంచారంతో ఈ రాశులకు అదృష్టం
శుక్రుడువిలాసాలు, డబ్బు, కళ, ప్రేమ వంటి వాటికి కారకుడు. ప్రతి 23 రోజులకు ఒకసారి శుక్రుడు తన రాశిని మారుస్తూ ఉంటాడు. ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఆగస్టు 1న ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రంలో శుక్రుని సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది.
కెరీర్‌లో, ఆర్థికంగా, వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు కనపడతాయి. ఈ సమయంలో మేషరాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి వారికి శుక్రుని ఆరుద్ర నక్షత్ర సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ఏ రాశికి ఏ విధంగా ప్రభావం ఉంటుందో చూద్దాం.
1.మేష రాశి
మేష రాశి వారికి శుక్రుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల శుభ ఫలితాలు ఎదురవుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపార ప్రయాణాలు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి వినోదకర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. విద్యార్థులకు ఇది మంచి సమయం. సానుకూల మార్పులు ఉంటాయి.
2.సింహ రాశి
సింహ రాశి వారికి ఇది అనుకూలమైన సమయం. శుక్రుని నక్షత్ర సంచారం వల్ల కెరీర్, వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. అప్పులు తీరిపోతాయి. కొత్త మిత్రులు పరిచయమవుతారు. కొత్త ఇల్లు లేదా వాహనాల కొనుగోలు చేస్తారు. జీతం పెరుగుతుంది. ప్రమోషన్‌లు రావచ్చు.
3.తులా రాశి
తులా రాశి వారికి కూడా శుక్రుని నక్షత్ర మార్పు శుభదాయకం. ప్రయాణాలు ఫలప్రదంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో ఆనందకరమైన పరిణామాలు సంభవిస్తాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. కళలు, అభిరుచులపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత ఉంటుంది.
4.ధనుస్సు రాశి
ఈ రాశి వారికి శుక్రుడి నక్షత్రమార్పు వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఒంటరిగా ఉన్నవాళ్లకు ప్రేమకు సంబంధించి మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకి జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



