అక్టోబర్ నెలలో బుధ, కుజుల సంయోగం, అదృష్టమంటే ఈ నాలుగు రాశులదే.. డబ్బు, ఆస్తులు, ప్రభుత్వ ఉద్యోగం ఇలా ఎన్నో!
బుధుడు తెలివితేటలు, వ్యాపారం, డబ్బు మొదలైన వాటికి కారకుడు. కుజుడు ధైర్యం, భూమి మొదలైన వాటికి కారకుడు. జ్యోతిష లెక్కల ప్రకారం బుధ, కుజుల సంయోగం తులా రాశిలో అక్టోబర్ నెలలో ఏర్పడనుంది. ఈ రెండు గ్రహాల కలయిక మంచి ఫలితాలని తీసుకువస్తుంది. కొన్ని రాశుల వారికి మాత్రం అనేక లాభాలు ఉంటాయి.
గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. బుధుడు తెలివితేటలు, వ్యాపారం, డబ్బు మొదలైన వాటికి కారకుడు. కుజుడు ధైర్యం, భూమి మొదలైన వాటికి కారకుడు. జ్యోతిష లెక్కల ప్రకారం బుధ, కుజుల సంయోగం తులా రాశిలో అక్టోబర్ నెలలో ఏర్పడనుంది.

ఈ రెండు గ్రహాలకలయిక మంచి ఫలితాలని తీసుకువస్తుంది. ద్వాదశ రాశుల వారిపై ఈ ప్రభావం ఉన్నప్పటికీ, కొన్ని రాశుల వారికి మాత్రం అనేక లాభాలు ఉంటాయి. బుధ, కుజుల సంయోగంతో ఏయే రాశుల వారికి కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తులా రాశిలో బుధ, కుజుల సంయోగం.. ఈ రాశుల వారికి అనేక లాభాలు
1.కర్కాటక రాశి
కర్కాటకరాశి వారికి ఈ రెండు ప్రధాన గ్రహాల సంయోగంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు, ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. పోటీ పరీక్షల్లో సక్సెస్ అవుతారు. వివాహితులు పిల్లలనుంచి శుభవార్తలు వింటారు.
2.కన్య రాశి
కన్య రాశివారికి ఈ రెండు ప్రధాన గ్రహాల సంయోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. భూమికి సంబంధించిన విషయాల్లో కూడా మంచి ఫలితాలు చూస్తారు. ఎవరికైనా దానాలు చేస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. పూర్వీకుల నుంచి ఆస్తి వస్తుంది.
3.వృశ్చిక రాశి
వృశ్చికరాశి వారికి ఇది శుభ సమయం. ఈ రెండు ప్రధాన గ్రహాల సంయోగంతో అక్టోబర్ నెలలో మంచి ఫలితాలు కలుగుతాయి. వ్యాపారులకు అనేక లాభాలు వస్తాయి. ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి, సక్సెస్ అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారికి మంచి లాభాలు వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. కొత్తగా పెళ్లయిన వారు శుభవార్తలు వింటారు.
4.మకర రాశి
మకరరాశి వారికి కూడా ఇది మంచి సమయం. ఈ రెండు ప్రధాన గ్రహాల సంయోగంతో మకర రాశివారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. వ్యాపారస్తులకు అనేక లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో రొమాంటిక్ ట్రిప్ వేస్తారు. కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



