కుజ కేతువుల సంయోగంతో జూలై 28 వరకు ఈ మూడు రాశులకు సమస్యలు.. ఆర్థిక నష్టం, అప్పులు, గొడవలు ఇలా ఎన్నో.. తస్మాత్ జాగ్రత్త!

కుజుడు ఇప్పటికే కేతువు ఉన్న సింహ రాశిలోకి ప్రవేశించాడు. కుజుడు, కేతువు రెండు ఉగ్ర గ్రహాలు. జూన్ 30 నుంచి కుజుడు, కేతువులు ఒకే రాశిలో సంచారం చేస్తారు. దీని కారణంగా అశుభ సంయోగం ప్రభావం పెరుగుతుంది. జూలై 28 వరకు ఈ కలయిక ఉంటుంది. ఇది మూడు రాశుల వారిపై భారీ ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది.

Published on: Jul 1, 2025, 12:00:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకదలిక, వాటి స్థానంలో మార్పులు ఆధారంగా ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కుజ కేతువుల సంయోగంతో ఈ మూడు రాశుల వారికి అనేక ఇబ్బందులు (Canva)
కుజ కేతువుల సంయోగంతో ఈ మూడు రాశుల వారికి అనేక ఇబ్బందులు (Canva)

ఇది ఇలా ఉంటే, కుజుడుఇప్పటికే కేతువు ఉన్న సింహ రాశిలోకి ప్రవేశించాడు. కుజుడు, కేతువు రెండు ఉగ్ర గ్రహాలు. జూన్ 30 నుంచి కుజుడు, కేతువులు ఒకే రాశిలో సంచారం చేస్తారు. దీని కారణంగా అశుభ సంయోగం ప్రభావం పెరుగుతుంది. జూలై 28 వరకు ఈ కలయిక ఉంటుంది.

ఇది మూడు రాశుల వారిపై భారీ ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. మరి ఈ మూడు రాశులు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఆ రాశుల వారు ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

కుజ కేతువుల సంయోగంతో ఈ మూడు రాశుల వారికి అనేక ఇబ్బందులు:

1.మేష రాశి

మేష రాశి వారికి కుజ కేతువుల సంయోగం ఇబ్బందులను తీసుకు వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు రావచ్చు. వ్యాపారులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. భారీగా నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం కాదు.

2.సింహ రాశి

సింహ రాశివారికి ఈ రెండు గ్రహాల సంయోగం వలన ఇబ్బందులు వస్తాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి సమస్యలు రావచ్చు. ఈ రాశి వారు శత్రువుల వల్ల కూడా బాధ పడవచ్చు. జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిస్క్ తీసుకోవడం మంచిది కాదు.

3.కన్య రాశి

కన్య రాశి వారికి కూడా కుజ కేతువుల సంయోగం వలన ఇబ్బందులు రావచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారికి కోపం విపరీతంగా పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కూడా సమస్యలు రావచ్చు. ఎక్కువైపోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More