...
...
Next Story

త్వరలో కుజుడు చంద్రుల సంయోగం, 3 రాశులకు ఊహించని లాభాలు.. ఉద్యోగస్తులకు బోనస్, వైవాహిక జీవితంలో సంతోషంతో పాటు ఎన్నో!

2025లో కుజుడు చంద్రుడి కలయిక సింహరాశిలో చోటు చేసుకుంటుంది. జూన్ 29న ఈ అరుదైన కలయిక ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపనుంది. 12 రాశుల వారిపై కొద్దిగా ప్రభావం పడినప్పటికీ, కొన్ని రాశుల వారికి మాత్రం విపరీతమైన లాభాన్ని తీసుకువస్తుంది.

Published on: Jun 2, 2025, 16:30:05 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

కుజుడు చంద్రుల కలయిక కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతోంది. 2025లో కుజుడు చంద్రుడి కలయిక సింహరాశిలో చోటు చేసుకుంటుంది. జూన్ 29న ఈ అరుదైన కలయిక ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపనుంది. 12 రాశుల వారిపై కొద్దిగా ప్రభావం పడినప్పటికీ, కొన్ని రాశుల వారికి మాత్రం విపరీతమైన లాభాన్ని తీసుకువస్తుంది.

త్వరలో కుజుడు చంద్రుల సంయోగం
త్వరలో కుజుడు చంద్రుల సంయోగం

కుజుడు, చంద్రుడు శుభగ్రహాలు. ఈ రెండూ కలిసి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాయి. కుజుడు సింహ రాశిలోకి జూన్ 7వ తేదీ ఉదయం 2:08 గంటలకు ప్రవేశించి, జూలై 28 రాత్రి 8:11 వరకు ఉంటాడు.

చంద్రుడు జూన్ 29 ఉదయం 5:30 గంటలకు సింహరాశిలోకి ప్రవేశించి, జూలై 1 మధ్యాహ్నం 3:23 వరకు ఉంటాడు. జూన్ 29న ఈ రెండు గ్రహాలు సంయోగం చెంది అదృష్టాన్ని తీసుకువస్తాయి.

కుజుడు–చంద్రుడి సంయోగంతో ఈ మూడు రాశుల వారికి బోలెడు లాభాలు:

1.సింహ రాశి

సింహరాశి వారికి కుజుడు–చంద్రుడి కలయిక అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. వ్యాపారులు ఎక్కువ లాభాలను అందుకుంటారు. కొత్త కారు కొనే అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు వస్తాయి. పెళ్లయిన వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. వీరికి శుభ ఘడియలు మొదలవుతాయి.

2.తులా రాశి

తులారాశి వారికి రెండు గ్రహాల సంయోగం అనేక లాభాలను అందిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు వారి పనికి తగ్గట్టుగా గుర్తింపును పొందుతారు. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కెరియర్‌లో కూడా సక్సెస్‌ను అందుకుంటారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

3.వృశ్చిక రాశి

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe