కుజుడు డబుల్ ధమాకాతో ఈ రాశులకు నాలుగు రెట్లు ఎక్కువ లాభాలు.. డబ్బు, అదృష్టం, సంతోషంతో పాటు ఎన్నో

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు ధైర్యం, భూమి శక్తి మొదలైన వాటికి కారకుడు. అయితే అక్టోబర్ చివర, నవంబర్లో కుజుడు సంచారంలో మార్పు ఉంటుంది. ఈ రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు ఉంటాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇంట్లో సంతోషం పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. 

Published on: Oct 28, 2025, 10:00:19 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు ధైర్యం, భూమి శక్తి మొదలైన వాటికి కారకుడు. అయితే అక్టోబర్ చివర, నవంబర్లో కుజుడు సంచారంలో మార్పు ఉంటుంది.

రెండు సార్లు కుజుడు సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి నాలుగు రెట్లు ఎక్కువ లాభాలు (pinterest)
రెండు సార్లు కుజుడు సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి నాలుగు రెట్లు ఎక్కువ లాభాలు (pinterest)

ఈ రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు ఉంటాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇంట్లో సంతోషం పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. మరి ఏ రాశి వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఈ సమయంలో ఏ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వంటి విషయాలను తెలుసుకుందాం.

రెండు సార్లు కుజ సంచారంలో మార్పు

కుజుడు అక్టోబర్ 27 అంటే నిన్న వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. అలాగే నవంబర్ 1న అనురాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. నవంబర్ 18 వరకు అనురాధ నక్షత్రంలో కుజుడు సంచారం చేస్తాడు. ఇలా రెండు సార్లు కుజుని సంచారంలో మార్పు రావడంతో ఈ రాశుల వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయి, నాలుగు రెట్లు వరకు ప్రయోజనాలను పొందుతారు. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

రెండు సార్లు కుజుడు సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి నాలుగు రెట్లు ఎక్కువ లాభాలు:

1.మిథున రాశి:

మిథున రాశి వారికి కుజుడు రెండుసార్లు రాశి మార్పు, సంచారంలో మార్పు చేయడంతో కెరీర్‌లో ఊహించని లాభాలు ఉంటాయి. ప్రమోషన్ రావచ్చు, జీతం పెరిగే అవకాశం ఉంది. బాధ్యతలు ఎక్కువ అవుతాయి. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకి కూడా ఇది శుభ సమయం. ఇంట్లో సంతోషం పెరుగుతుంది.

2.సింహ రాశి:

సింహ రాశి వారికి కుజ సంచారం అనేక విధాలుగా కలిసి వస్తుంది. రెండు సార్లు కుజుడు సంచారంలో మార్పు రావడంతో శుభఫలితాలు ఎదురవుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

3.మకర రాశి:

మకర రాశి వారికి కుజుడు రెండుసార్లు సంచారంలో మార్పు చేయడంతో శుభఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి రావాల్సిన డబ్బు వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకి కూడా ఇది మంచి సమయం. జీవిత భాగస్వామితో మీ బంధం మరింత దృఢంగా మారుతుంది. శుభవార్తలు వింటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More