సాముద్రిక శాస్త్రం ప్రకారం ఈ స్త్రీ, పురుషులు చాలా లక్కీ!
సాముద్రిక శాస్త్రం వ్యక్తి ఆర్థిక పరిస్థితి, వృత్తి, వైవాహిక జీవితం, ఆరోగ్యం ఎలా ఉంటాయన్నది కూడా చెప్తుంది. సాముద్రిక శాస్త్రం మనకి ఎంతవరకు అదృష్టం ఉంది వంటి విషయాలను కూడా వివరంగా చెబుతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీ, పురుషుల శరీరంపై ఇవి ఉంటే వారు చాలా లక్కీ.
శరీర భాగాల నిర్మాణం, గుర్తులు, రంగు, పుట్టుమచ్చలు మొదలైన వాటి బట్టి శుభ, అశుభ సంకేతాల గురించి సాముద్రిక శాస్త్రం చెబుతుంది. సాముద్రికశాస్త్రం వ్యక్తి ఆర్థిక పరిస్థితి, వృత్తి, వైవాహిక జీవితం, ఆరోగ్యం ఎలా ఉంటాయన్నది కూడా చెప్తుంది.

సాముద్రిక శాస్త్రం మనకి ఎంతవరకు అదృష్టంఉంది వంటి విషయాలను కూడా వివరంగా చెబుతుంది. అత్యంత పవిత్రమైన సంకేతాల గురించి చూస్తే – అరచేతుల్లో చక్రం, చేప, ధ్వజం, శంఖం ఉన్నట్లయితే ఆ వ్యక్తులు కీర్తి, సంపదను పొందుతారు.
కమలం, చక్రం అరికాలి పై ఉంటే ఆ వ్యక్తి ప్రజాధారణను పొందుతాడు. వీళ్ళు ఆధ్యాత్మికంలో, రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా కూడా కీర్తి, ప్రతిష్ఠలను పొందగలరు.
సాముద్రిక శాస్త్రం ప్రకారం పురుషులకు ఇలా ఉంటే వారంత అదృష్టవంతులు మరొకరు ఉండరు:
- అరచేతి మధ్యలో పుట్టుమచ్చఉండే పురుషులు అదృష్టవంతులు.
- చాతి వెడల్పుగా ఉన్న పురుషులు కూడా అదృష్టవంతులు.
- ముక్కు పొడుగ్గా ఉండే పురుషులు కూడా అదృష్టవంతులు.
- చూపుడు వేలు పొడుగ్గా ఉన్న పురుషులు కూడా అదృష్టవంతులు.
- చాతిపై మందంగా జుట్టు ఉంటే కూడా అదృష్టవంతులు.
- పాదాలపై కమలం, రథం లేదా బాణం గుర్తులు ఉంటే కూడా అదృష్టవంతులు.
- నాభి లోతుగా, గుండ్రంగా ఉన్న పురుషులు కూడా అదృష్టవంతులు.
ఈ స్త్రీలు కూడా అదృష్టవంతులు
- ముఖం గుండ్రంగా, పెద్ద కళ్లతో ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులు.
- మెడ పొడుగ్గా ఉన్న స్త్రీలుకూడా అదృష్టవంతులు.
- అరచేతులు ఎర్రగా, మృదువుగా ఉన్న స్త్రీలు కూడా అదృష్టవంతులు.
- అరికాళ్లపై కమలం, శంఖం లేదా చక్రం గుర్తులు ఉంటే కూడా అదృష్టవంతులు.
- బొటనవేలు వెడల్పుగా, గుండ్రంగా ఉంటే కూడా అదృష్టవంతులు.
- బొటనవేలు పైన త్రిశూలం గుర్తుఉన్న స్త్రీలు కూడా అదృష్టవంతులు.
- పెదాలపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు కూడా అదృష్టవంతులు.
- కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉంటే కూడా అదృష్టవంతులు.
- అరచేతి మధ్యలో పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీలు అదృష్టవంతులు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper













