ఈ నెలలో పుట్టిన అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే లైఫ్ అంతా ఖుషీ!

జీవితంలోకి వచ్చే అబ్బాయి తనను బాగా చూసుకోవాలని, ప్రేమను పంచుకోవాలని, బంధానికి ఎక్కువగా విలువ ఇవ్వాలని అనుకుంటుంది. అదే విధంగా ఆ అమ్మాయి తనను బాగా నమ్మాలని, ఇద్దరూ కలిసి సంతోషంగా జీవించాలని, సరదాగా ఉండాలని అనుకుంటుంది. కొన్ని నెలల్లో పుట్టిన అబ్బాయిల్లో ఎన్నో ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. 

Published on: Aug 9, 2025, 14:00:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పుట్టిన నెల కూడా మన గురించి కొన్ని రహస్యాలు చెబుతుంది. ఎలా అయితే న్యూమరాలజీ, రాశులు మన గురించి, మన భవిష్యత్తు గురించి తెలుపుతాయో, అదే విధంగా పుట్టినరోజు కూడా మన గురించి అనేక విషయాలు చెబుతుంది. ప్రతి అమ్మాయి కూడా పెళ్లి అంటే ఎన్నో కలలు కంటుంది. జీవిత భాగస్వామి ఇలా ఉండాలని, పెళ్లి తర్వాత జీవితం ఇలా ఉండాలని అనుకుంటుంది.

ఈ నెలలో పుట్టిన అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే లైఫ్ అంతా ఖుషీ! (pinterest)
ఈ నెలలో పుట్టిన అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే లైఫ్ అంతా ఖుషీ! (pinterest)

ఇవన్నీ పక్కన పెడితే, జీవితంలోకి వచ్చే అబ్బాయి తనను బాగా చూసుకోవాలని, ప్రేమను పంచుకోవాలని, బంధానికి ఎక్కువగా విలువ ఇవ్వాలని అనుకుంటుంది. అదే విధంగా ఆ అమ్మాయి తనను బాగా నమ్మాలని, ఇద్దరూ కలిసి సంతోషంగా జీవించాలని, సరదాగా ఉండాలని అనుకుంటుంది.

అయితే అమ్మాయిలూ మీరు కూడా అలంటి భర్తను పొందాలనుకుంటే, కచ్చితంగా ఈ నెలలోపుట్టిన అబ్బాయిల గురించి తెలుసుకోండి. కొన్ని నెలల్లో పుట్టిన అబ్బాయిల్లో ఎన్నో ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. భార్యను ఎల్లప్పుడూ పూర్తిగా నమ్ముతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలని అనుకుంటారు. మరి ఏ నెలలో పుట్టిన వారు భార్యను బాగా చూసుకుంటారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

1.జూన్ నెల

జూన్ నెలలో పుట్టిన అబ్బాయిలు మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. భార్యల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది. దాంతో జీవితాంతం సంతోషంగా చూసుకుంటారు. ఇలాంటి భర్తలుకలలో కూడా భార్యకు ద్రోహం చేయరు. భారీ ఆనందం కోసం ఏం చేయడానికైనా సరే సిద్ధపడతారు. ధైర్యంగా ముందు అడుగు వేస్తారు.

2.మే నెల

మే నెలలో పుట్టిన అబ్బాయిలు తన భార్యను ఎంతో బాగా చూసుకుంటారు. జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. వారి జీవితంలోకి వచ్చే అమ్మాయిని ఎంతగానో ప్రేమిస్తారు. వారిపై నమ్మకం కూడా ఎక్కువగా ఉంటుంది. భార్య భావాలకు కూడా ఎక్కువ విలువను ఇస్తారు. ఒకరిని మోసం చేసే తత్వం కాదు.

3.అక్టోబర్ నెల

అక్టోబర్ నెలలో పుట్టిన వారు కూడా భార్యను బాగా చూసుకుంటారు. వైవాహికజీవితంలో ఎంతో నమ్మకంగా ఉంటారు. ఈ నెలలో పుట్టిన పురుషులు భార్యలతో ఎమోషనల్‌గా కనెక్షన్‌ను పెంచుకుంటారు. అందుకే భార్యలను ఏమాత్రం మోసం చేయరు. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని అనుకుంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More