జూలై 4న దక్షిణం వైపుకి బుధుడు.. ఈ 5 రాశుల వారికి సంపద, గౌరవం, పురోగతితో పాటు ఎన్నో!

బుధుడు మేదస్సు, ప్రసంగం, సంభాషణ, కమ్యూనికేషన్‌కు కారకుడు. బుధుడు దక్షిణ మార్గంలో ఉన్నప్పుడు ఆత్మ పరిశీలనకు, పాత పనులను పూర్తి చేసుకోవడానికి ఇది మంచి సమయం. ఈ సమయంలో ప్రజలు చర్చలు, సంభాషణలు, వ్యాపార నిర్ణయాల్లో స్పష్టతను పొందుతారు.

Published on: Jun 27, 2025, 15:00:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో కొన్ని రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు మాత్రం లాభాలు పొందుతారు. జ్యోతీష శాస్త్రం ప్రకారం సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువు తప్ప మిగిలిన గ్రహాలు గురువు, శుక్రుడు, బుధుడు, కుజుడు, శని వంటి ఇతర గ్రహాలు రాశులను మార్పు చెందడంతో పాటుగా సూర్యుని చుట్టూ తిరుగుతాయి.

జూలై 4న దక్షిణం వైపుకి బుధుడు
జూలై 4న దక్షిణం వైపుకి బుధుడు

ఈ గ్రహాలుసూర్యుని చుట్టూ తిరిగి వృత్తాకార మార్గాన్ని "ఎక్లిప్టిక్" అని అంటారు. ఈ మార్గంలో బుధుడు తన దిశను జూలై 4న మార్చుకుంటాడు. దృక్ పంచాంగం ప్రకారం బుధుడు శుక్రవారం ఉదయం 9:03 గంటలకు ఉత్తరం నుంచి దక్షిణంలోకి తిరుగుతాడు. దక్షిణానికి వెళ్లడం వలన కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది కూడా.

బుధుడు అనుగ్రహంతో

బుధుడుమేదస్సు, ప్రసంగం, సంభాషణ, కమ్యూనికేషన్‌కు కారకుడు. బుధుడు దక్షిణ మార్గంలో ఉన్నప్పుడు ఆత్మ పరిశీలనకు, పాత పనులను పూర్తి చేసుకోవడానికి ఇది మంచి సమయం. ఈ సమయంలో ప్రజలు చర్చలు, సంభాషణలు, వ్యాపార నిర్ణయాల్లో స్పష్టతను పొందుతారు. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపించినప్పటికీ, ఐదు రాశుల వారికి మాత్రం ఇది శుభప్రధానంగా ఉంటుంది. మరి ఆ రాశుల్లో మీ రాశి ఉందేమో చూద్దాం.

ఐదు రాశుల వారికి బుధుని ప్రత్యేక అనుగ్రహం, శుభ ఫలితాలు

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి బుధుడు ఈ సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ రాశి వారు ప్రమోషన్లు పొందుతారు. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు కూడా ఉండొచ్చు. బిజినెస్ చేసే వారికి కొత్త క్లయింట్లు వస్తారు. బంధం కూడా దృఢంగా ఉంటుంది.

2.కర్కాటక రాశి

కర్కాటకరాశి వారికి టెన్షన్లు తొలగిపోతాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పని ప్రదేశంలో సక్సెస్‌ను అందుకుంటారు. ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో కూడా సక్సెస్ ఉంటుంది. బుధుడి మార్పు వలన పాత ఇన్వెస్ట్మెంట్ల వలన ఎక్కువ లాభం వస్తుంది. కొత్త పనులన్నీ ప్రారంభించడానికి ఇది మంచి సమయం.

3.వృశ్చిక రాశి

వృశ్చికరాశి వారికి ఆర్థికపరంగా ఇది కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో మీ దగ్గరికి రాని ధనం ఈ సమయంలో వస్తుంది. ఒత్తిడి తొలగిపోతుంది. సంతోషంగా ఉంటారు.

4.మకర రాశి

మకరరాశి వారు కొత్త బాధ్యతలను చేపడతారు. కొత్త ప్రాజెక్టులను మొదలుపెడతారు. టెక్నికల్ లేదా కమ్యూనికేషన్ ఫీల్డ్‌లో ఉన్న వారికి ఈ సమయం బాగుంటుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు.

5.కన్య రాశి

కన్య రాశి వారికి ఇది మంచి సమయం. చాలా కాలంగా ఆగిపోయిన కెరీర్ మళ్ళీ ప్రారంభం అవుతుంది. పెట్టుబడులతో లాభాలను వస్తాయి. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More