కర్కాటక రాశిలో బుధుడి తిరోగమనంతో ఈ మూడు రాశుల వారికి సమస్యలు రావచ్చు.. జాగ్రత్త సుమా!

బుధుడి తిరోగమనం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ మూడు రాశుల వారు మాత్రం బుధుడు తిరోగమనంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశుల వారికి కొన్ని నష్టాలు రావచ్చు. ఆర్థికపరంగా కూడా ఇబ్బందులు వస్తాయి.

Published on: Jul 08, 2025 9:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాల రాకుమారుడు బుధుడు జులై 18 నుంచి తిరోగమనంలో ఉంటాడు. బుధుడుకర్కాటక రాశిలో తిరోగమనంలో సంచరిస్తాడు. ఆగస్టు 11న ప్రత్యక్షంగా ఉంటాడు. బుధుడు జులై 18 ఉదయం 10:12 గంటలకు కర్కాటక రాశిలో తిరోగమనం చెందుతాడు. బుధుడు తిరోగమనం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ మూడు రాశుల వారు మాత్రం బుధుడు తిరోగమనంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశుల వారికి కొన్ని నష్టాలు రావచ్చు. ఆర్థికపరంగా కూడా ఇబ్బందులు వస్తాయి.

బుధుడు తిరుగమనం
బుధుడు తిరుగమనం

మరి బుధుడి తిరోగమనం ఏ రాశుల వారికి సమస్యలను తీసుకువస్తుంది, ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బుధుడి తిరోగమనంతో ఈ మూడు రాశుల వారికి సమస్యలు రావచ్చు

1.మేష రాశి

మేష రాశి వారికి బుధుడు తిరోగమనం వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరంగా సమస్యలు రావచ్చు. పనిలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రిలేషన్‌షిప్‌లో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

2.మిధున రాశి

మిధునరాశి వారికి కూడా బుధుడు తిరోగమనం వలన చిన్నపాటి సమస్యలు వస్తాయి. బుధుడు తిరోగమనంవలన కెరీయర్‌లో సమస్యలు రావచ్చు. ఆర్థికపరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు నష్టాలు రావచ్చు. కాబట్టి రిస్క్ తీసుకోకుండా ఉంటే మంచిది. కుటుంబ సభ్యులతో సరదాగా, సంతోషంగా ఉండండి. లేదంటే గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.

3.సింహ రాశి

సింహరాశి వారికి బుధుడు తిరోగమనం వలన చిన్నపాటి సమస్యలు రావచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందలేకపోవచ్చు. ఆర్థికపరంగా కూడా ఇబ్బందులు రావచ్చు. అనవసరమైన వాటిని ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాబట్టి డబ్బును ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More