రక్షాబంధన్ వేళ ఈ మూడు రాశుల వారికి బోలెడు లాభాలు.. బుధుని ఉదయంతో డబ్బు, శుభకార్యాలు ఇలా ఎన్నో!

ఆగస్టు 9న రాఖీ పండుగ వచ్చింది. అదే రోజున బుధుడు కర్కాటక రాశిలో ఉదయించనున్నాడు. పైగా ఆ రోజు శ్రవణ, ధనిష్ట నక్షత్రాల కలయిక జరగబోతోంది. సిద్ధి యోగం కూడా ఉంటుంది. కర్కాటక రాశిలో అదే రోజు బుధుడు ఉదయించడంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. మరి ఏ రాశుల వారు బుధుని ఉదయంతో శుభ ఫలితాలను పొందుతారు?

Published on: Aug 8, 2025, 14:00:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ ఏడాది ఆగస్టు 9న రాఖీ పండుగ వచ్చింది. అదే రోజున బుధుడు కర్కాటక రాశిలో ఉదయించనున్నాడు. పైగా ఆ రోజు శ్రవణ, ధనిష్ట నక్షత్రాల కలయిక జరగబోతోంది. సిద్ధి యోగం కూడా ఉంటుంది. కర్కాటక రాశిలో అదే రోజు బుధుడు ఉదయించడంతో కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల ఆసక్తిని కూడా పెంచుకుంటారు.

ఈ మూడు రాశుల వారికి రక్షాబంధన్ వేళ బుధుని ఉదయంతో బోలెడు లాభాలు
ఈ మూడు రాశుల వారికి రక్షాబంధన్ వేళ బుధుని ఉదయంతో బోలెడు లాభాలు

మీడియా, విద్య, మార్కెట్ రంగాల వారికి ఈ సమయం కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి కూడా ఇది మంచి సమయం. మరి ఏ రాశుల వారు బుధుని ఉదయంతో శుభ ఫలితాలను పొందుతారు? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో తెలుసుకుందాం.

ఈ మూడు రాశుల వారికి రక్షాబంధన్ వేళ బుధుని ఉదయంతో బోలెడు లాభాలు:

1.వృషభ రాశి:

వృషభరాశి వారికి బుధుని ఉదయం శుభ ఫలితాలను అందిస్తుంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు ప్రేమ, అందానికి కారకుడు. శుక్రుడు, బుధుడు రెండూ కూడా స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉంటాయి. బుధుని ఉదయంతో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల ఆసక్తిని కూడా పెంచుకుంటారు.

2.కర్కాటక రాశి:

కర్కాటకరాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారు బుధుని ఉదయంతో పలు లాభాలను పొందుతారు. ఈ సమయంలో రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయి. కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి కూడా ఇది మంచి సమయం. ఇంట్లో శుభకార్యాలను కూడా నిర్వహిస్తారు.

3.వృశ్చిక రాశి:

వృశ్చికరాశి వారికి బుధుని ఉదయం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆర్థికపరంగా కూడా ప్రయోజనాలు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. పురోగతి సాధిస్తారు. మీడియా, విద్య, మార్కెట్ రంగాల వారికి ఈ సమయం కలిసి వస్తుంది. సంతోషంగా ఉంటారు. ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More