...
...
Next Story

పుష్యమి నక్షత్రంలో బుధుని సంచారం, ఐదు రాశులకు బోలెడు లాభాలు.. కొత్త అవకాశాలు, ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు ఇలా ఎన్నో!

జూన్ 25న బుధుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దానితో పాటుగా ఇంకా ఎన్నో లాభాలను పొందుతారు.

Published on: Jun 26, 2025, 09:00:05 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్తుంటాయి. ఈ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. జూన్ 25న బుధుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. జూన్ 25 ఉదయం 5:08 గంటలకు పుష్యమి నక్షత్రంలోకి బుధుడుప్రవేశించాడు. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని దేవుడు. గురువు, చంద్రుని ప్రభావం కూడా ఈ నక్షత్రం పై ఉంటుంది.

పుష్యమి నక్షత్రంలో బుధుని సంచారం
పుష్యమి నక్షత్రంలో బుధుని సంచారం

ఈ నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దానితో పాటుగా ఇంకా ఎన్నో లాభాలను పొందుతారు. మరి ఏ రాశులవారికి బుధుని నక్షత్ర సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది? ఎలాంటి లాభాలను వారు పొందుతారు? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బుధుని నక్షత్ర సంచారంతో ఈ ఐదు రాశులకు ఎన్నో లాభాలు

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి పుష్యమి నక్షత్ర సంచారం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి బాగా కలిసి వస్తుంది. ప్రమోషన్లు వస్తాయి. ప్రశాంతకరమైన జీవితాన్ని గడుపుతారు.

2.కర్కాటక రాశి

కర్కాటక రాశివారికి ఈ సమయంలో కలిసి వస్తుంది. బంధం దృఢంగా మారుతుంది. విద్యార్థులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. పరీక్షలకు, ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అయ్యేవరకు కూడా ఈ సమయం బాగుంటుంది. ఉద్యోగం మారినా కూడా ఇక ముందు మంచి సమయం ఉంటుంది. కొత్త వాటిని మొదలు పెడితే కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

3.తులా రాశి

తులా రాశి వారికి ఈ సమయం బాగుంటుంది. కెరీర్‌లో సక్సెస్‌ను పొందుతారు. మీడియా, మార్కెటింగ్ వంటి రంగాలకు సక్సెస్ ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.

4.కన్యా రాశి

మకర రాశి వారికి ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు అనుకున్న వాటిని సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు. సీనియర్ల సపోర్ట్ మీకు ఉంటుంది. వ్యాపారులకు సమయం కలిసి వస్తుంది. ఆర్థిక లాభాలను పొందుతారు. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో జీవిత భాగస్వామి సపోర్ట్ మీకు చాలా అవసరం.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks