మరి కొన్ని రోజుల్లో పునర్వసు నక్షత్రంలోకి బుధుడు.. ఈ 5 రాశులకు విపరీతమైన అదృష్టం, ధనం, ఉద్యోగాలు ఇలా ఎన్నో!

జూన్ 16 సోమవారం నాడు బుధుడు పునర్వసులోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ఈ నక్షత్ర సంచారం 12 రాశుల వారిపై ప్రభావం చూపించినా, కొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకురావడం తో పాటు లాభాలనూ అందిస్తుంది. ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

Published on: Jun 11, 2025 4:30 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు కాలానుగుణంగా రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. బుధుడు పునర్వసు నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. జూన్ 16 సోమవారం నాడు బుధుడుపునర్వసులోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది.

మరి కొన్ని రోజుల్లో పునర్వసు నక్షత్రంలోకి బుధుడు
మరి కొన్ని రోజుల్లో పునర్వసు నక్షత్రంలోకి బుధుడు

ఈ నక్షత్రసంచారం 12 రాశుల వారిపై ప్రభావం చూపించినా, కొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకురావడంతో పాటు లాభాలనూ అందిస్తుంది. ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

బుధుడి నక్షత్ర మార్పుతో ఈ రాశులకు బోలెడు లాభాలు

1.మేష రాశి

మేషరాశి వారికి బుధుడు నక్షత్ర సంచారం అనేక లాభాలను అందిస్తుంది. ఈ రాశివారు ఆర్థిక పరంగా ప్రయోజనాలను పొందుతారు. కష్టానికి తగిన ఫలితం అందుతుంది. కుటుంబమంతా సరదాగా, సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. కెరీర్‌లో అనేక అవకాశాలు వస్తాయి.

2.సింహ రాశి

సింహరాశి వారికి బుధుడి నక్షత్ర సంచారం పలు లాభాలను తీసుకు వస్తుంది. ఈ రాశి వారు ఈ సమయంలో పూర్వీకుల ఆస్తిని పొందుతారు. కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది. జీవిత భాగస్వామి కూడా కష్టసమయాల్లో తోడుగా ఉంటారు. సానుకూల మార్పులు వస్తాయి. ఈ సమయంలో ఎక్కువ డబ్బును ఆదా చేస్తారు. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి.

3.తులా రాశి

తులారాశి వారికి బుధుడు నక్షత్ర సంచారం అనేక లాభాలను అందిస్తుంది. ఈ సమయంలో వీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అవివాహితులకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

4.కుంభ రాశి

కుంభరాశి వారికి బుధుడి నక్షత్ర మార్పుతో అనేక లాభాలున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వారు ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఆదాయాన్ని పొందుతారు. ఆర్ట్, క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నవారికి ఈ సమయం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తొలగిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు.

5..ధనస్సు రాశి

ధనస్సురాశి వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది. ఎప్పటినుంచి చేతికి రాని డబ్బు ఇప్పుడు తిరిగి వస్తుంది. మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. పనులను కూడా పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి వ్యాపారంలో కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ సమయంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

News/Rasi Phalalu/మరి కొన్ని రోజుల్లో పునర్వసు నక్షత్రంలోకి బుధుడు.. ఈ 5 రాశులకు విపరీతమైన అదృష్టం, ధనం, ఉద్యోగాలు ఇలా ఎన్నో!
News/Rasi Phalalu/మరి కొన్ని రోజుల్లో పునర్వసు నక్షత్రంలోకి బుధుడు.. ఈ 5 రాశులకు విపరీతమైన అదృష్టం, ధనం, ఉద్యోగాలు ఇలా ఎన్నో!