సింహ రాశిలో బుధుడి తిరోగమనం, 12 రాశుల వారిపై ప్రభావం.. ఈ 4 రాశులకు జూలై, ఆగస్టులో సమస్యలు రావచ్చు!
జూలై 17న సింహ రాశిలో తిరోగమనం చెంది ఆగస్టు 11 వరకు అదే రాశిలో ఉంటుంది. సింహ రాశిలో బుధుడి తిరోగమనం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఏ రాశుల వారు ఎక్కువ ప్రభావితం అవుతారు? ఎవరు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది?
2025లో బుధుడు రెండోసారి తిరోగమనం చెందుతున్నాడు. సింహ రాశిలోకి బుధుడు అడుగుపెడతాడు. జూలై 17న సింహ రాశిలో తిరోగమనం చెంది ఆగస్టు 11 వరకు అదే రాశిలో ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారికి కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి, కొన్ని రాశులవారికి అశుభ ఫలితాలు ఎదురవుతాయి.

సింహ రాశిలో బుధుడితిరోగమనం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఏ రాశుల వారు ఎక్కువ ప్రభావితం అవుతారు? ఎవరు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సింహ రాశి, వృషభ రాశి, వృశ్చిక రాశి, కుంభ రాశి వారు చిన్న చిన్న చాలెంజ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి: బుధుడు తిరోగమనం కారణంగా సింహ రాశి వారికి చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సింహ రాశి వారికి కలిసి వస్తుంది. మీరు అనుకున్న వాటిలో సక్సెస్‌ని అందుకోవచ్చు.
కుంభ రాశి:కుంభ రాశి వారికి రిలేషన్షిప్ విషయంలో బావుంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. నిజాయితీ మీకు సురక్షితమైన మార్గం.
వృషభ రాశి:వృషభ రాశి వారు ఒకటికి రెండు సార్లు మళ్లీ మళ్లీ అన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఒప్పందాలు క్యాన్సిల్ అవ్వడం వంటి విషయాలు జరుగుతాయి.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి కెరీర్‌లో చిన్నపాటి సమస్యలు రావచ్చు. వృత్తి పరమైన లక్ష్యాలను మళ్లీ అంచనా వేయడానికి బ్రేక్ తీసుకుని మళ్లీ మొదలు పెట్టడం మంచిది.
మేష రాశి: మేష రాశి వారు ఫోకస్‌గా ఉండాలి. కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాజెక్టులపై ప్రభావం పడుతుంది.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి గాయాలు మళ్లీ ఇబ్బందిని కలిగించవచ్చు. జాగ్రత్తగా వ్యవహరిస్తే సమస్యలు రాకుండా ఉంటాయి.
తుల రాశి: తుల రాశి వారు ఈ సమయంలో చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా బ్యాలెన్స్‌గా ఉండేందుకు చూసుకోండి.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఘర్షణకు దారి తీసే అవకాశం ఉంటుంది.
మకర రాశి: మకర రాశి వారికి అసాంఘిక విషయాల పరిశీలన అవసరం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి: మీన రాశి వారు వారిపై వారు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఎనర్జీ తక్కువవడం వల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మిథున రాశి: మిథున రాశి వారు ఎక్కువ విని తక్కువ మాట్లాడితే మంచిది. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.
కన్యా రాశి: కన్యా రాశి వారు అంతర్గత విమర్శకులు తీవ్రతరం కావచ్చు. మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



