చంద్రుడు, గురువు సంయోగంతో ఏర్పడే శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఈరోజే.. ఈ 3 రాశులకు విపరీతమైన అదృష్టం, ధనంతో పాటు మరెన్నో!

చంద్రుడు, గురువు సంయోగంతో గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. గజకేసరి రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టంగా మారుతుంది. 12 రాశుల వారిపై ప్రభావం పడినప్పటికీ, కొన్ని రాశుల వారికి మాత్రమే విపరీతమైన లాభాలను తీసుకువస్తుంది. మరి ఏ రాశుల వారు ప్రయోజనాన్ని పొందుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: May 28, 2025 9:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మిధున రాశిలో చంద్రుని సంచారంతో గురువు చంద్రుని కలయిక ఏర్పడుతుంది. ఇది గజకేసరి రాజయోగాన్ని సృష్టిస్తోంది. ఈ రాజయోగంఅన్ని రాశులను ప్రభావితం చేస్తుంది, కానీ కొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకువస్తుంది.

గజకేసరి రాజయోగం ఈ మూడు రాశులకు బోలెడు లాభాలు (pinterest)
గజకేసరి రాజయోగం ఈ మూడు రాశులకు బోలెడు లాభాలు (pinterest)

మే 28 మధ్యాహ్నం 1:36 గంటలకు చంద్రుడు వృషభ రాశి నుంచి బుధుడి రాశి అయిన మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇదే సమయంలో గురువు కూడా మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా గ్రహాల సంచార మార్పుతో గజకేసరిరాజయోగం ఏర్పడనుంది. గజకేసరి రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టంగా మారుతుంది.

12 రాశులవారిపై ప్రభావం పడినప్పటికీ, కొన్ని రాశుల వారికి మాత్రమే విపరీతమైన లాభాలను తీసుకువస్తుంది. మరి గజకేసరి రాజయోగంతో ఏ ఏ రాశుల వారు ప్రయోజనాన్ని పొందుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

గజకేసరి రాజయోగం

చంద్రుడు మిధునరాశిలోకి ప్రవేశించడం, అదే విధంగా గురువు కూడా మిధున రాశిలో సంచారం చేయడం వలన చంద్రుడు–గురువు కలయిక కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఈ మూడు రాశుల వారికి లక్ష్మీదేవిఅనుగ్రహంతో పాటుగా విపరీతమైన అదృష్టం కలుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎన్నో లాభాలను కూడా పొందుతారు.

గజకేసరి రాజయోగం ఈ మూడు రాశులకు బోలెడు లాభాలు

1. మిధున రాశి:

మిధున రాశివారికి గజకేసరి రాజయోగం అనేక విధాలుగా సహాయపడుతుంది, అదృష్టాన్ని అందిస్తుంది. ఈ సమయంలో వారిపై వారికి నమ్మకం కూడా కలుగుతుంది. శుభవార్తలు వింటారు. ఎప్పటి నుంచో ఉన్న కష్టాలన్నీ కూడా ఈ సమయంలో తీరిపోతాయి. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఈ సమయంలో విజయాలను అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి.

2. సింహ రాశి:

సింహరాశి వారికి గజకేసరి రాజయోగం ఎన్నో లాభాలను ఇస్తుంది. ఈ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. ఆదాయంలో కూడా ఎంతో మార్పు వస్తుంది. సక్సెస్‌ను కూడా అందుకుంటారు. వ్యాపారులకు కూడా గజకేసరి రాజయోగంతో అనేక లాభాలు ఉంటాయి. పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు వస్తాయి. ఇలా గజకేసరి రాజ యోగంతో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.

3. కుంభ రాశి:

కుంభరాశి వారికి గజకేసరి రాజయోగం అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఊహించని విధంగా ఆర్థిక లాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంపాదన కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు వచ్చి ఆర్థిక లాభాన్ని పొందుతారు. ఈ రాశి వారు పిల్లల నుండి కూడా శుభవార్తలు వింటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More