మరి కొన్ని రోజుల్లో చంద్ర, కుజుడి సంయోగంతో మహాలక్ష్మీ యోగం.. మిథున రాశితో పాటు 2 రాశులకు ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో!
జూన్ చివరిలో చంద్రుడు సింహ రాశిలోకి వెళ్తాడు. అదే సమయంలో కుజుడుతో సంయోగం చెందడం వలన విశిష్టమైన రాజయోగం ఏర్పడుతుంది. దానిని చంద్ర కుజ యోగం లేదా మహాలక్ష్మి యోగం అని అంటారు. మహాలక్ష్మి యోగం కారణంగా కొన్ని రాశుల వారికి సంపద పెరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా గ్రహాలు రాశి మార్పు చెందడం వలన అన్ని రాశుల వారిపై అది ప్రభావం చూపిస్తుంది, కానీ కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహాలక్ష్మియోగం శుభ యోగం. చాలా రాశుల వారికి మంచి ఫలితాలను అందిస్తుంది.

చంద్రుని రాశి మార్పు
చంద్రుడువేగంగా కదలే గ్రహం. రెండున్నర రోజులకు ఒకసారి చంద్రుడు తన రాశిని మారుస్తూ ఉంటాడు. ఈ సమయంలో పలు రాశులతో సంయోగం చెందుతాడు. ఇలా చంద్రుని రాశి మార్పు కారణంగా శుభయోగాలు ఏర్పడతాయి.జూన్ చివరిలో చంద్రుడు సింహ రాశిలోకి వెళ్తాడు. అదే సమయంలో కుజుడుతో సంయోగం చెందడం వలన విశిష్టమైన రాజయోగం ఏర్పడుతుంది.
మహాలక్ష్మి యోగం
దానిని చంద్ర కుజయోగం లేదా మహాలక్ష్మి యోగం అని అంటారు. మహాలక్ష్మి యోగం కారణంగా కొన్ని రాశుల వారికి సంపద పెరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కేతువు కూడా సింహ రాశిలోనే ఉన్నాడు. మహాలక్ష్మి యోగం వలన ఏ రాశుల వారికి కలిసి వస్తుంది? ఎవరు అలాంటి లాభాలను పొందుతారు వంటి విషయాలను తెలుసుకుందాం.
మహాలక్ష్మి యోగం సమయం జూన్ 29 ఉదయం 6:30. మూడు గంటలకు చంద్రుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. జూలై 1 వరకు అదే రాశిలో ఉంటాడు. కుజుడు ఇప్పటికే ఆ రాశిలో ఉన్నాడు కాబట్టి 54 గంటల పాటు మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది.
మహాలక్ష్మి యోగంతో మూడు రాశుల వారికి బోలెడు లాభాలు
1.మిథున రాశి
మిథున రాశి వారికి ఈ యోగం కారణంగా అనేక శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి నమ్మకం విపరీతంగా పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తారు. తోబుట్టులతో బంధం మధురంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది.
2.మీన రాశి
మీన రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం అనేక శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కష్టాల నుంచి బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలు వస్తాయి.
3.తులా రాశి
తులా రాశి వారికి మహాలక్ష్మి యోగం అనేక విధాలుగా సహాయపడుతుంది. ఆర్థికపరంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పాత అప్పులు తీరిపోతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఈ రాశి వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. బంధం మధురంగా మారుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



