తులా రాశిలోకి చంద్రుడు ప్రవేశంతో ఈ మూడు రాశుల వారికి అనేక లాభాలు.. ధన లాభం, అదృష్టం ఇలా ఎన్నో!
చంద్రుడు ప్రేమ, అందం, విలాసాలను అందిస్తాడు. చంద్రుడు తులా రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి ఇది కలిసి వస్తుంది. ఉద్యోగులు వారి బాస్ నుంచి ప్రశంసలు పొందుతారు. మరి ఏ రాశుల వారికి తులా రాశిలో చంద్రుని ప్రవేశం శుభప్రదంగా ఉంటుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారనేది ఇప్పుడు తెలుసుకుందాం.
జూలై 4 నుంచి జూలై 6 వరకు చంద్రుడుతులా రాశిలో ఉంటాడు. నిన్న ఉదయం 3:18కి తులా రాశిలోకి చంద్రుడు ప్రవేశించాడు. రెండు రోజులు పాటు, అంటే జూలై 6 సాయంత్రం నాలుగు గంటల వరకు తులా రాశిలోనే ఉంటాడు. ఇది కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది.

తులా రాశి
తులా రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రేమ, అందం, విలాసాలను అందిస్తాడు. శుక్రుడి రాశిలోకి చంద్రుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి ఇది కలిసి వస్తుంది. మరి ఏ రాశుల వారికి తులా రాశిలో చంద్రుని ప్రవేశం శుభప్రదంగా ఉంటుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
చంద్రుడు రాశి మార్పు
చంద్రుడు మార్పు కూడా చాలా ముఖ్యమైనది. చంద్రుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకిప్రవేశించినప్పుడు కొన్ని శుభయోగాలు ఏర్పడతాయి. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది, అనేక ప్రయోజనాలను కల్పిస్తుంది. సంతోషం, మానసిక ప్రశాంతత, ప్రేమ ఇలాంటివన్నీ కూడా అందుతాయి.
తులా రాశిలోకి చంద్రుడు ప్రవేశంతో ఈ మూడు రాశుల వారికి అనేక లాభాలు:
1.మకర రాశి
మకరరాశి వారికి చంద్రుని తులా రాశి సంచారం కలిసి వస్తుంది. ఈ సమయంలో మకర రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా లాభం వస్తుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉంటారు.
కలిసి సమయాన్ని గడపడం వలన వారి ప్రేమ మరింత దృఢంగా మారుతుంది. పెళ్లి కానివారు ఇష్టపడే వారికి ఆ విషయాన్ని చెప్పడానికి ఇదే మంచి సమయం. ఈ సమయంలో ఈ రాశి వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది.
2.వృశ్చిక రాశి
వృశ్చికరాశి వారికి చంద్రుని సంచారం వివిధ లాభాలను కల్పిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు వారి బాస్ నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పెద్దవారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
3.తులా రాశి
తులారాశిలో చంద్రుని సంచారం ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. మంచి వార్తలు అందుతాయి. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఎప్పటి నుంచో పూర్తికాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. వ్యాపారులకు హఠాత్తుగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



