...
...
Next Story

శని చెడు ఫలితాల నుంచి బయటపడాలంటే, శనీశ్వరుడుకి ఈ 4 పూలను సమర్పించండి!

శని దేవుడు తన సంచరిస్తున్న రాశితోనే కాదు, ముందు, వెనక రాశుల వారిపైన కూడా ప్రభావం చూపిస్తాడు. శని దేవుడిని ఆరాధించేటప్పుడు శని దేవుడికి ఇష్టమైన పూలను సమర్పిస్తే మంచిది. ఈరోజు శనీశ్వరుడి అనుగ్రహం కలగాలంటే, శని పూజలో ఏ పువ్వులను ఉపయోగించాలి అనే దాని గురించి తెలుసుకుందాం.

Published on: May 27, 2025, 16:30:14 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

మనం చేసే పనుల ఆధారంగా శని ఫలితాలని ఇస్తాడు. మంచి వాటికి మంచి ఫలితాలని ఇచ్చే శని, చెడు పనులకు చెడుఫలితాలను కూడా ఇస్తాడు. కర్మలను శని గమనిస్తాడని అందరూ భయపడిపోతూ ఉంటారు. శని దేవుడు న్యాయానికి ప్రతీక.

శని దేవుడికి ఈ పూలు అంటే చాలా ఇష్టం
శని దేవుడికి ఈ పూలు అంటే చాలా ఇష్టం

నవగ్రహాల్లో ఏ దేవుడిని "ఈశ్వరా" అని సంబోధించారు, కానీ శనిని మాత్రం "శనీశ్వరుడు" అని అంటారు. శని దేవుడు తన సంచరిస్తున్న రాశితోనే కాదు, ముందు, వెనక రాశుల వారిపైన కూడా ప్రభావం చూపిస్తాడు.

శనిదేవుడిని ఆరాధించేటప్పుడు శని దేవుడికి ఇష్టమైన పూలను సమర్పిస్తే మంచిది. ఈరోజు శనీశ్వరుడి అనుగ్రహం కలగాలంటే, శని పూజలో ఏ పువ్వులను ఉపయోగించాలి అనే దాని గురించి తెలుసుకుందాం.

శని దేవుడికి ఈ పూలు అంటే చాలా ఇష్టం

1.మందారం పూలు:

శని దేవుడికి మందారం పూలుఅంటే ఇష్టం. ఈ పూలను శనికి సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. చెడు ప్రభావం తగ్గుతుంది. శని జయంతి, శనివారం లేదా శని త్రయోదశి ఇలా ఏ సమయంలోనైనా శని దేవుడికి మందారం పూలను సమర్పించండి. శని దేవుడు చల్లని చూపు మీ పై పడుతుంది.

2.షమీ పూలు:

శని దేవుడికి ఈ పూలు అంటే ఎంతో ప్రీతి. షమీ పూలను శని దేవుడికి సమర్పించడం వలన మంచి ఫలితం ఉంటుంది. శని దేవుడి అనుగ్రహం ఉంటుంది. షమీ ఆకులు, షమీ పూలను శనిదేవునికి సమర్పించడం వలన శుభ ఫలితాలనుపొందవచ్చు. శనిదేవుని ప్రత్యేక ఆశీస్సులు కూడా కలుగుతాయి.

3.జిల్లేడు పూలు:

శని దేవుడికి జిల్లేడుపూలు కూడా ఇష్టం. వీటిని శని దేవుడికి సమర్పించడం వలన ఏలినాటి శని ప్రభావం నుంచి సులువుగా బయటపడవచ్చు. అలాగే శని దేవుని ఆశీస్సులు కలిగి సంతోషంగా ఉండవచ్చు.

4.శంఖు పూలు:

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe