ఆఫీసులో ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే.. పదోన్నతి, భారీ వేతనం పక్కా!
ప్రతిరోజూ చాలామంది అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని పొరపాట్లు చేయకుండా ఉంటే ఇబ్బంది రాకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా కష్టపడే పని చేయాలని, జీవితంలో ముందుకు వెళ్లాలని, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావాలని కోరుకుంటారు. ఆఫీసులో ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే పదోన్నతి, భారీ వేతనం ఖాయం.
చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి, సంతోషంగా ఉండొచ్చు. వాస్తు ప్రకారం కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవడం కూడా మంచిది.

ప్రతిరోజూ చాలామంది అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని పొరపాట్లు చేయకుండా ఉంటే ఇబ్బంది రాకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా కష్టపడే పని చేయాలని, జీవితంలోముందుకు వెళ్లాలని, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావాలని కోరుకుంటారు. ఈ విధంగా వ్యాపారవేత్తలు లాభాలు రావాలని కోరుకుంటారు. ఎన్నో రోజుల నుంచి ప్రయత్నించినా అనుకున్న పనులు నెరవేరకపోతే చాలా బాధగా అనిపిస్తుంది.
ఏ దిశలో కూర్చుని పని చేయాలి?
వాస్తుప్రకారం పని ప్రదేశంలో మీరు కూర్చునే ప్రదేశం చాలా ముఖ్యమైనది. సరైన దిశలో కూర్చుంటే పురోగతి వస్తుంది. సరైన దిశలో కూర్చోకపోతే ఇబ్బందులు వస్తాయి. అయితే, పని ప్రదేశంలో ఎటువైపు కూర్చుంటే మంచిది? లాభాలు రావాలంటే ఎలాంటి పొరపాట్లు చేయకూడదు? ఎటువంటి వాటిని పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వర్క్ చేసేటప్పుడు ఏ దిశలో కూర్చుంటే మంచిది?
ఉద్యోగం లేదా వ్యాపారం చేసేవారు సరైన దిశలోకూర్చుని పని చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. విజయం కలగాలంటే కచ్చితంగా సరైన దిశలో కూర్చుని పని చేయాలి. ఇక మరి ఏ దిశలో కూర్చోవాలో తెలుసుకుందాం.
పశ్చిమ దిశ
వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఇబ్బందులు కలగకుండా, మంచి జరగాలన్నా, అనుకున్నవి పూర్తి కావాలన్నా, సక్సెస్‌ని అందుకోవాలన్నా పశ్చిమ దిశలో కూర్చోవడం మంచిది. కార్యాలయంలో ఈ దిశలో కూర్చోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. వేతన పెరుగుదల, పదోన్నతి వంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ దిశలో కూర్చుంటే ఏ ఆటంకాలు లేకుండా అనుకున్న పనులు పూర్తవుతాయి.
ఇలా చేయచ్చు
ఒకవేళ మీరు పశ్చిమం వైపు కూర్చోవడం కుదరకపోతే నైరుతి, వాయువ్యం వైపు కూర్చుని పనిచేయవచ్చు. దీనితో పాటుగా బంగారం లేదా వెండి రంగులో ఉన్న ఫోటోకానీ పెయింటింగ్ కానీ పడమర వైపు పెట్టండి. దీని వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
ఒకవేళ కనుక పశ్చిమం వైపు కూర్చున్నా మీకు సరైన ఫలితాలు రానట్లయితే, జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోండి. మీ జాతకం ప్రకారం ఏ దిశలో కూర్చుని పని చేస్తే మంచి ఫలితాలు కనబడతాయో తెలుసుకుని, దాని ప్రకారం అనుసరిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


