ఆగస్టు 26న శని-శుక్రల రాజయోగం, ఈ మూడు రాశుల వారి పంట పండినట్టే.. డబ్బు, శుభవార్తలు ఇలా ఎన్నో!
గ్రహాల మార్పుతో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. ఈ శుభయోగాలు, అశుభయోగాలు ద్వాదశ రాశుల వారి జీవితంలో ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రస్తుతం శని మీన రాశిలో సంచారం చేస్తున్నాడు, శుక్రుడు మిధున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ రాశుల్లో ఉంటూ ఇతర గ్రహాలతో కలిసి యోగాలను ఏర్పరుస్తున్నాయి.
గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాల మార్పుతో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. ఈ శుభయోగాలు, అశుభయోగాలు ద్వాదశ రాశుల వారి జీవితంలో ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రస్తుతం శని మీన రాశిలో సంచారం చేస్తున్నాడు, శుక్రుడు మిధున రాశిలో సంచారం చేస్తున్నాడు.

జ్యోతిష్యశాస్త్రంలో శనిని న్యాయానికి అధిపతిగా భావిస్తారు. శుక్రుడు శుభగ్రహం. శుక్రుడు విలాసాలు, సంపద మొదలైన వాటికి కారకుడు. జాతకంలో ఈ రెండు గ్రహాలు కూడా వృత్తి జీవితంపైనే కాదు, భౌతిక సుఖాలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రస్తుతం శని మీన రాశిలో సంచారం చేస్తున్నాడు, శుక్రుడు మిధున రాశిలో సంచారం చేస్తున్నాడు.
ఈ రాశుల్లో ఉంటూ ఇతర గ్రహాలతో కలిసి యోగాలను ఏర్పరుస్తున్నాయి. ఆగస్టు 26న ఉదయం 6:30కి శని, శుక్రుడుఒకరికొకరు 120 డిగ్రీల దూరంలో ఉంటారు. ఇది మంచి యోగాన్ని ఏర్పరుస్తుంది. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. మరి ఏ రాశుల వారు అదృష్టాన్ని పొందుతారు, ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మూడు రాశులకు కలిసి రానున్న గురు శుక్రుల యోగం
1.సింహ రాశి
సింహ రాశి వారికి గురు శుక్రుల యోగం మంచి ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కనపడుతోంది. ఈ సమయంలో విద్యార్థులు కూడా శుభవార్తలు వింటారు. ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నాలు కలుస్తాయి, విజయాలను అందుకుంటారు. ఈ రాశి వారు మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది మంచి సమయం.
2.మేష రాశి
మేష రాశివారికి శని, శుక్రుల యోగం మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి సానుకూల ఫలితాలు ఎదురవుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. వ్యాపార ఒప్పందాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.
3.మీన రాశి
మీన రాశి వారికి కూడా ఇది మంచి సమయం. శని, శుక్రుల శుభయోగం వృత్తి, వ్యాపారాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తుంది. విజయాలను అందుకుంటారు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వారికి ఈ సమయం ఫలిస్తుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలి అనుకుంటే కూడా ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఇదే మంచి సమయం. విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి కొత్త సమాచారం అందుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



