జూలై 8న రోహిణి నక్షత్రంలోకి శుక్రుడు, ఈ మూడు రాశులకు ఊహించని లాభాలు.. కెరీర్ అద్భుతం, ప్రేమ జీవితం మధురం!

శుక్రుడిని శుభ గ్రహంగా భావిస్తారు. శుక్రుడు ఆనందం, ధనం, ప్రేమ, విలాసాలకే కారకుడు. జూలై 8న సాయంత్రం 4:31కి శుక్రుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. మరి ఆ రాశుల వారు ఎవరు? ఆ రాశి వారు ఎలాంటి లాభాలను పొందుతారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Jul 05, 2025 1:30 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని శుభ గ్రహంగా భావిస్తారు. శుక్రుడు ఆనందం, ధనం, ప్రేమ, విలాసాలకే కారకుడు. ఒకరి జాతకంలో శుక్రుడు స్థానం బలంగా ఉంటే, ఆ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు, సంతోషంగా ఉంటారు. ఇతరులు వారికి సులువుగా కనెక్ట్ అవుతారు, అందం కూడా పెరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడురాశి మార్పు చెందినా, నక్షత్రం మార్పు చెందినా శుభ ఫలితాలు ఉంటాయి. కెరీర్‌లో, ప్రేమ జీవితంలో కూడా మార్పులు వస్తాయి.

జూలై 8న రోహిణి నక్షత్రంలోకి శుక్రుడు
జూలై 8న రోహిణి నక్షత్రంలోకి శుక్రుడు

రోహిణి నక్షత్రంలోకి శుక్రుడు

జూలై 8న సాయంత్రం 4:31కి శుక్రుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారంకొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. మరి ఆ రాశుల వారు ఎవరు? ఆ రాశి వారు ఎలాంటి లాభాలను పొందుతారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రోహిణి నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అనేక లాభాలు

1.వృషభ రాశి

వృషభరాశి వారికి శుక్రుడి నక్షత్రం మార్పు అనేక శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. కొత్త మార్గాల ద్వారా ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత వస్తుంది. ప్రాజెక్టులు, కాంట్రాక్టులు స్వీకరిస్తారు. శుక్రుడి నక్షత్ర మార్పు వలన మీ రిలేషన్‌షిప్‌లో కూడా సమస్యలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి, సంతోషంగా ఉండొచ్చు.

2.కర్కాటక రాశి

కర్కాటకరాశి వారు కూడా శుక్రుడి నక్షత్రం మార్పుతో అనేక లాభాలను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు సక్సెస్‌ను అందుకుంటారు. ఈ సమయంలో కర్కాటక రాశి వారు దేశ ప్రయాణాలు చేస్తారు. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. గౌరవం పెరుగుతుంది, సమాజంలో విలువ పెరుగుతుంది.

3.తులా రాశి

తులా రాశివారికి ఈ సమయం కలిసి వస్తుంది. శుక్రుడి నక్షత్ర మార్పు ఈ రాశి వారికి అనేక శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కొత్త కాంట్రాక్టులు స్వీకరిస్తారు. ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. రిలేషన్‌షిప్‌లోకి అడుగు పెడతారు. కళలు కూడా ఇంప్రూవ్ అవుతాయి. దగ్గర వారి నుండి సపోర్ట్ ఉంటుంది. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది, ప్రేమ పెరుగుతుంది. కెరీర్ కూడా కలిసి వస్తుంది, ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More